ENG vs IND : భారత్‌తో ఐదో టెస్టు.. వరల్డ్ రికార్డు సృష్టించేందుకు అతి చేరువలో జోరూట్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ వేదికగా గురువారం (జూలై 31) నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ENG vs IND 5th test Joe Root eye on becoming first player to create major WTC world record
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ వేదికగా గురువారం (జూలై 31) నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకబడి ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి లేదంటే డ్రా చేసుకుని సిరీస్ విజేతగా నిలవాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ ఓ అరుదైన రికార్డు పై కన్నేశాడు.
ఈ మ్యాచ్‌లో రూట్ 54 పరుగులు చేస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తాడు. కాగా.. డబ్ల్యూటీసీలో 5వేల పరుగులు దాటిన తొలి వ్యక్తి కూడా రూట్ కావడం గమనార్హం. కాగా.. రూట్ మినహా వరే వ్యక్తి కూడా డబ్ల్యూటీసీలో 4500 పరుగులు దాటలేదు.
డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* జోరూట్ (ఇంగ్లాండ్) – 5946 పరుగులు
* స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 4278 పరుగులు
* మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా) – 4225 పరుగులు
* బెన్‌స్టోక్స్ (ఇంగ్లాండ్) – 3616 పరుగులు
* ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 3300 పరుగులు
WCL 2025 : యువీ, యూసఫ్, బిన్నీ మెరుపులు.. సెమీస్‌కు భారత్.. పాక్‌తో ఆడేనా?
ఇక తన కెరీర్‌లో ఇప్పటి వరకు జోరూట్ 157 టెస్టులు ఆడాడు. 286 ఇన్నింగ్స్‌ల్లో 51.2 సగటుతో 13409 పరుగులు చేశాడు. ఇందులో 38 శతకాలు, 66 అర్థశతకాలు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే రూట్ కన్నా ముందు ఉన్నాడు. సచిన్ 200 టెస్టులు ఆడాడు. 329 ఇన్నింగ్స్‌ల్లో 53.78 సగటుతో 15921 పరుగులు చేశాడు. ఇందులో 51 శతకాలు, 68 అర్థశతకాలు ఉన్నాయి.