KL Rahul confirms Sanju Samson role in South Africa ODI series
దక్షిణాప్రికాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు టీమ్ఇండియా వన్డే సిరీస్‌కు సిద్దమైంది. ఆదివారం వాండరర్స్ వేదికగా జరగనున్న మొదటి వన్డేలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు రోజు తాత్కాలిక కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ మీడియాతో ముచ్చటించాడు. టీ20ల్లో ఇరగదీస్తున్న రింకూసింగ్ వన్డే అరంగ్రేటంతో పాటు జట్టులో సంజు శాంసన్ స్థానానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
వన్డేల్లో రింకూ సింగ్ అరంగ్రేటం చేస్తాడా అని విలేకరులు ప్రశ్నించగా కేఎల్ రాహుల్ ఇలా సమాధానం ఇచ్చాడు. తొలి వన్డేల్లో రింకూ సింగ్ ఆడే అవకాశం ఉందన్నాడు. అతడు అద్భుతమైన ఆటగాడని కొనియాడాడు. ఐపీఎల్ నుంచి అతడి నైపుణ్యాలు చూస్తూనే ఉన్నామని చెప్పాడు.
ఒత్తిడిలోనూ కూల్‌గా ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసన్నాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో అతడు అద్భుతంగా రాణించాడని మెచ్చుకున్నాడు. కాగా.. టీ20లతో పోలిస్తే వన్డేలు కాస్త భిన్నమైన ఫార్మాట్. పొట్టి ఫార్మాట్‌లో రాణించిన రింకూ వన్డేల్లో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాల్సిందే.
ఇక తుది జట్టులో సంజు శాంసన్ ఉంటాడా ఉండడా అనే విషయం పైనా రాహుల్ స్పందించాడు. సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. అతడు ఎప్పటిలాగానే ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ వస్తాడన్నాడు. స్వతహాగా సంజు శాంసన్ వికెట్ కీపర్ అయినప్పటికీ కూడా తానే కీపింగ్ చేయనున్నట్లు రాహుల్ వెల్లడించాడు. ఈ సిరీస్‌లో అవకాశం ఉంటే ఏదో ఒక మ్యాచులో సంజు కీపింగ్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమన్నాడు.
IND vs ENG : అలా కాదు భయ్యా ఫోటోలు తీసేది.. ఇలా కదా తీయాలి.. భారత మహిళా క్రికెటర్ పాఠాలు..!