KL Rahul leaks confidential team india dressing room plan
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ కోసం భారత్ సిద్ధం అవుతుంది. డే అండ్ నైట్‌గా జరిగే ఈ పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టులో ఆడని కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. హిట్‌మ్యాన్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఏ స్థానంలో ఆడతాడు అనే దానిపై అందరిలో ఆసక్తి ఉంది.
ఈ క్రమంలో రాహుల్ ఓపెనర్‌గానే బరిలోకి దిగాలని, రోహిత్ శర్మ తన స్థానాన్ని మార్చుకోవాలని కొందరు మాజీ ఆటగాళ్లు సూచనలు చేస్తున్నారు. కాగా.. ఈ అంశంపై కేఎల్ రాహుల్ స్పందించాడు. రెండో టెస్టు మ్యాచులో మీరు ఏ స్థానంలో ఆడాలో జట్టు మేనేజ్‌మెంట్ మీకు చెప్పిందా అని కేఎల్ రాహుల్‌ను ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి రాహుల్ ఇలా సమాధానం చెప్పాడు.
అవును చెప్పారు. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో నాకు స్పష్టంగా చెప్పారు. అయితే.. ఆ విషయాన్ని మాత్రం మీతో పంచుకోవద్దని కూడా సూచించారు. అని అన్నాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. తాను ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధమేనని రాహుల్ చెప్పుకొచ్చాడు. తాను తుది జట్టులో ఉండాలని మాత్రమే అనుకుంటున్నానని అన్నాడు. అందుకనే ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలని చెబితే ఆ స్థానంలో దిగుతానన్నాడు. జట్టు కోసం ఆడతానన్నాడు.
టాప్ ఆర్డర్ లేదా మిడిల్ ఆర్డర్ ఎక్కడ బ్యాటింగ్ చేసినా సరే.. మొదటి 30 బంతులను సమర్థవంతంగా ఎదుర్కొంటే.. ఆ తరువాత బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ అవుతుందన్నాడు. తన దృష్టి దీనిపైనే ఉందన్నాడు. ఏ స్థానంలో ఆడినా సరే ఇన్నింగ్స్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలో తనకు తెలుసునని కేఎల్ రాహుల్ తెలిపాడు.
Prithvi Shaw : ఇది కదరా పృథ్వీ షా అంటే.. మూడు బంతుల్లో.. మారేదే లే..!
KL Rahul sharing the update of not sharing his batting position. 😂pic.twitter.com/8YensX8TnZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 4, 2024