KL Rahul : ధోని చూస్తుండ‌గానే అత‌డి రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన కేఎల్ రాహుల్‌..

కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

KL Rahul – MS Dhoni : ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టింది. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన ల‌క్నో శుక్ర‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో విజ‌య కేత‌నం ఎగుర‌వేసింది. ఈ క్ర‌మంలో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను మ‌రింతగా మెరుగుప‌ర‌చుకుంది.

ఈ మ్యాచ్‌లో ల‌క్ష్య ఛేద‌న‌లో ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ దుమ్ములేపాడు. 53 బంతులు ఎదుర్కొన్న అత‌డు 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది 82 ప‌రుగులు చేశాడు. దీంతో రాహుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన వికెట్ కీప‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో ఎంఎస్ ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

Uppal : 25న ఉప్ప‌ల్‌లో జ‌రిగే ఆర్‌సీబీ వ‌ర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌ను అడ్డుకుంటాం..

ఐపీఎల్ చ‌రిత్ర‌లో వికెట్ల కీప‌ర్ల జాబితాలో కేఎల్ రాహుల్ 25 సార్లు 50కి పైగా ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో మ‌హేంద్ర సింగ్ ధోని 24 సార్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధికసార్లు 50కి పైగా స్కోరు నమోదు చేసిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు..

కేఎల్‌ రాహుల్ – 25 సార్లు
మహేంద్ర సింగ్‌ ధోని – 24 సార్లు
క్వింటన్‌ డికాక్ – 23 సార్లు
దినేశ్‌ కార్తిక్ – 21 సార్లు
రాబిన్‌ ఊతప్ప – 18 సార్లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత‌ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 176 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (57నాటౌట్‌), ర‌హానే (36), మోయిన్ (30), ధోని (28నాటౌట్‌) రాణించారు. ల‌క్ష్యాన్ని ల‌క్నో 19 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు న‌ష్ట‌పోయి ఛేదించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (82), క్వింట‌న్ డికాక్ (54) లు హాఫ్ సెంచ‌రీల‌తో బాదారు.

Tom Moody : టీమ్ఇండియాను హెచ్చ‌రించిన టామ్ మూడీ.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు అత‌డొద్దు..

ట్రెండింగ్ వార్తలు