Kohli Trying To Play In Pakistan Pace Great Stunning Insight
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై సందిగ్థత వీడడం లేదు. ఈ మెగా టోర్నీని పాకిస్థాన్‌లో నిర్వహిస్తారా లేదా హైబ్రిడ్ మోడ్‌లో జరగనుందా? లేదా పాక్ కాకుండా మరొక దేశం ఆతిథ్యం ఇవ్వనుందా అన్నది ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం లేదని ఐసీసీకి బీసీసీణ చెప్పింది. అయితే.. హైబ్రిడ్ మోడ్ లో టోర్నీ తమకు ఆమోదయోగ్యం కాదని, మొత్తం టోర్నీని పాక్‌లోనే నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతోంది. దీంతో టోర్నీ నిర్వహణపై సందిగ్థత కొనసాగుతోంది. మరోవైపు పీసీబీని ఐసీసీ ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
SA vs IND : భారత్ పై టీ20 సిరీస్ ఓటమి.. దక్షిణాఫ్రికా పేసర్‌కు షాకిచ్చిన ఐసీసీ
దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వెనుక ఛానల్ చర్చలు జరుగుతున్నాయి. మనం ఆశలు కోల్పోకూడదు. త్వరలోనే పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. భారత్ నుంచే ఐసీసీకి 95 నుంచి 96 శాతం స్పాన్సర్ షిప్ వస్తుందనే విషయం తమకి తెలుసు అని అన్నాడు. అయితే.. ఈ విషయం ప్రభుత్వాలకు సంబంధించింది అని చెప్పుకొచ్చాడు. బీసీసీఐకి దీనితో సంబంధం లేదన్నాడు.
ఇక టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మొదటి సారి పాకిస్థాన్‌లో ఆడాలని ప్రయత్నిస్తున్నట్లుగా అక్తర్ తెలిపాడు. కాగా.. కెరీర్ ఆరంభం నుంచి కోహ్లీ ఒక్కసారి కూడా పాకిస్థాన్‌లో ఆడలేదు.
ఇక పాక్‌లో కోహ్లీ ఆడాలని పాకిస్థాన్ కోరుకుంటుందని అక్తర్ చెప్పాడు.. ఒకవేళ కోహ్లీ పాకిస్థాన్‌లో సెంచరీ సాధించాడని ఊహించుకోండి. అప్పుడు అతడి కెరీర్ సంపూర్ణమవుతుందన్నాడు. ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని పాకిస్థాన్‌కు ఓ పేరు ఉంది. ఒకవేళ పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే.. పెద్ద టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తొలి అడుగుపడినట్లే అని అక్తర్ తెలిపాడు. ఆశలు కోల్పోవద్దని, చివరి వరకు ఏం జరుతుందో చూద్దామని చెప్పాడు. భారత్ పాకిస్థాన్‌కు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
Shoaib Akhtar on Virat Kohli “Virat Kohli is trying to play in Pakistan for the first time. Pakistan wants to see Virat play in Pakistan. Imagine him scoring a century in Pakistan. It will be a full circle for him” #CT25 #ViratKohli𓃵 #shoaibak pic.twitter.com/stnAdoocxU
— Muhammad Sami (@mrsami96) November 20, 2024