Women Asian Champions Trophy 2024 : మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైన‌ల్‌కు భార‌త్‌.. సెమీస్‌లో జ‌పాన్ పై విజ‌యం

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది.

Women Asian Champions Trophy 2024 : మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైన‌ల్‌కు భార‌త్‌.. సెమీస్‌లో జ‌పాన్ పై విజ‌యం

Women Asian Champions Trophy 2024 India enter into final

Updated On : November 19, 2024 / 7:19 PM IST

Women Asian Champions Trophy 2024 : మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. రాజ్‌గిర్ వేదిక‌గా జ‌పాన్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో 2-0 తేడాతో విజ‌యం సాధించింది. లీగ్ ద‌శ‌లో వ‌రుస విజ‌యాల‌తో సెమీస్‌కు దూసుకువ‌చ్చిన భార‌త్ అదే జోష్‌లో అజేయంగా ఫైన‌ల్‌కు చేరుకుంది. వైస్‌ కెప్టెన్‌ నవనీత్‌ కౌర్‌, లాల్‌రెమ్సియామి చెరో గోల్ చేశారు.

మ్యాచ్ ఆరంభం నుంచి హోరా హోరీగా సాగింది. ఇరు జ‌ట్లు ప్ర‌త్య‌ర్థి గోల్ పోస్టుల‌పై దాడులు చేశాయి. తొలి మూడు క్వార్ట‌ర్స్ వ‌ర‌కు ఇరు జ‌ట్లు ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయాయి. నాలుగో క్వార్ట‌ర్‌లో భార‌త మ‌హిళ‌లు రెండు గోల్స్ సాధించారు. తొలుత 48 వ నిమిషంలో న‌వనీత్ కౌర్ గోల్ చేయ‌డంతో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

Blind T20 World Cup : పాక్‌కు షాక్‌.. అంధుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి వైదొలిగిన భార‌త్‌..!

ఆ త‌రువాత 56వ నిమిషంలో లాల్‌రెమ్సియామి మ‌రో సాధించింది. దీంతో భార‌త్ ఆధిక్యం 2-0 కి చేరింది. మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు ఆధిక్యాన్ని కాపాడుకున్న భార‌త్ ఫైన‌ల్‌కు చేరుకుంది.

ఇక బుధ‌వారం ఫైన‌ల్ మ్యాచ్‌లో చైనా, భార‌త్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

SA vs SL : ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. కెప్టెన్ వ‌చ్చేస్తున్నాడు..