KKR vs RCB : ఉత్కంఠ పోరులో బెంగ‌ళూరు పై కోల్‌క‌తా విజ‌యం.. అడుగంటిన ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ ఆశలు..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

KKR vs RCB

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన ఉత్కంఠ పోరులో ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యాన్ని సాధించింది. 223 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 221 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో విల్ జాక్స్ ( 55; 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), ర‌జ‌త్ పాటిదార్ (52; 23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు బాదారు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ఆండ్రీ ర‌సెల్ మూడు వికెట్లు తీశాడు. సునీల్ న‌రైన్‌, హ‌ర్షిత్ రాణాలు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఈ ఓట‌మితో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ దాదాపుగా క‌నుమ‌రుగు అయ్యాయి. ఈ మ్యాచ్‌తో క‌లిపి ఎనిమిది మ్యాచులు ఆడ‌గా ఏడింటిలో ఓడిపోయింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో కొన‌సాగుతోంది.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ చెప్పాక చేసేదేముంది..! ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌లో మార్పుల‌కు బీసీసీఐ క‌స‌ర‌త్తులు..?

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (50; 36 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఫిల్ సాల్ట్ (48; 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో య‌శ్ ద‌యాల్‌, కామెరూన్ గ్రీన్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, లాకీ ఫెర్గూస‌న్ చెరో వికెట్ తీశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తాకు శుభారంభం ద‌క్కింది. ఫిల్ సాల్ట్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో బెంగ‌ళూరు బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. 14 బంతుల్లోనే 48 ప‌రుగులు చేశాడు. దూకుడుగా ఆడే క్ర‌మంలో 4.2వ ఓవ‌ర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ఔట్ అయ్యాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు.

Dinesh Karthik : ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ అరుదైన ఘ‌న‌త‌.. ధోని, రోహిత్ త‌రువాత అత‌నే..

కాసేప‌టికే మ‌రో ఓపెన‌ర్ సునీల్ న‌రైన్ (10) ఔట్ కాగా.. ఆదుకుంటారు అని భావించిన ర‌ఘువంశీ (3), వెంక‌టేశ్ అయ్య‌ర్ (16) లు విఫ‌లం కావ‌డంతో కోల్‌క‌తా 97 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో రింకూ సింగ్ (24)తో క‌లిసి శ్రేయ‌స్ అయ్య‌ర్ జ‌ట్టును ఆదుకున్నాడు. వీరిద్ద‌రు ఐదో వికెట్ కు 40 ప‌రుగులు జోడించారు. రింకూ ఔటైనా త‌న‌దైన శైలిలో ఆడుతూ శ్రేయ‌స్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంట‌నే అత‌డు కూడా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఆఖ‌ర్లో ఆండ్రీ ర‌స్సెల్ (27నాటౌట్‌; 20 బంతుల్లో 4ఫోర్లు), ర‌మ‌న్‌దీప్ సింగ్ (24నాటౌట్; 9 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స‌ర్లు) రాణించ‌డంతో కోల్‌క‌తా స్కోరు 200 దాటింది.

ట్రెండింగ్ వార్తలు