విశ్వవేదికపై సత్తా చాటిన కోనేరు హంపి

  • Published By: vamsi ,Published On : February 17, 2020 / 09:06 AM IST
విశ్వవేదికపై సత్తా చాటిన కోనేరు హంపి

Updated On : February 17, 2020 / 9:06 AM IST

ఆంధ్ర అమ్మాయి కోనేరు హంపీ అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటింది. క్రెయిన్స్ కప్ 2020లో ప్రపంచ రాపిడ్‌ ఛాంపియన్‌, భారతీయ క్వీన్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అమెరికాలో జరిగిన ఈ టోర్నమెంట్లో 9 రౌండ్ల టోర్నీలో.. హంపి ఆరు పాయింట్లు సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరో రౌండ్‌ మిగిలి ఉండగానే ఆమె విక్టరీ ఖాయమైంది.

కెయిన్స్‌ కప్‌ను నిర్వహించడం ఇది రెండవసారి కాగా.. ఇంటర్నేషనల్‌ చెస్‌ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. ప్రస్తుత వరల్డ్‌ ఛాంపియన్‌ జూ వెంజున్‌.. అయిదున్నర పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టానిక్‌ మూడవ స్థానంలో నిలిచింది. గత ఏడాది మహిళల రాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌‌ను కోనేరు హంపి గెలుచుకుంది. ఆ టోర్నీలో చైనాకు చెందిన లీ యంగ్జీపై ఆమె విజయం సాధించింది. 

కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌ ఎనిమిదో రౌండ్‌లో రష్యా గ్రాండ్‌ మాస్టర్‌ వాలెంటినా గునీనాపై నెగ్గిన హంపి.. మరో రౌండ్‌ మిగిలుండగానే మొత్తం 5.5 పాయింట్లతో సింగిల్‌గా టాప్‌లో నిలిచింది. కెయిన్స్‌ కప్‌ విజేత హంపికి.. టోర్నీ నిర్వాహకులు 45 వేల డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ట్రోఫీని కూడా ఆమెకు బహూకరిస్తారు. ఈ ఏడాది తొలి టోర్నమెంట్ గెలుచుకోగా.. ప్రపంచ ర్యాకింగ్స్ రెండో స్థానం లో కోనేరు హంపి నిలిచింది.

Koneru Humpy wins Cairns Cup