KL Rahul : కేఎల్ రాహుల్, ల‌క్నో మ‌ధ్య విభేదాలు స‌మ‌సిపోలేదా? గిల్‌, పంత్‌, జ‌డేజా ఇలా అందిరి ఫోటోలు పెట్టి..

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేసిన ఓ పోస్టు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ఓ పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.

Lucknow Super Giants ignoring kl rahul netizens fires

ఇంగ్లాండ్ గ‌డ్డ పై టీమ్ఇండియా అద‌ర‌గొట్టింది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో స‌మం చేసింది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియాలోని ఆట‌గాళ్ల పై పొగ‌డ్త‌త‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆట‌గాళ్ల‌ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నాయి. అయితే.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేసిన ఓ పోస్టు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ఓ పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.

ల‌క్నో పోస్ట్ చేసిన ఫోటోలో.. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ లు ఉన్నాయి. కానీ.. ఈ సిరీస్‌లో 500కి పైగా ప‌రుగులు చేసి జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ పిక్ మాత్రం లేదు. దీనిపైనే అభిమానులు మండిప‌డుతున్నారు.

Australia : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ఆస్ట్రేలియా ఓపెన‌ర్లుగా డేంజ‌ర‌స్‌ ప్లేయ‌ర్లు.. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లే..

కావాల‌నే చేసిందా?

ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా ప‌లు సీజ‌న్ల‌లో కేఎల్ రాహుల్ వ్య‌వ‌హ‌రించాడు. అత‌డి నాయ‌క‌త్వంలో తొలి రెండు సీజ‌న్ల‌లో ల‌క్నో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిసిన వెంట‌నే మైదానంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ల‌క్నో జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గొయెంకా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్ప‌ట్లోనే వైర‌ల్‌గా మారాయి. గొయెంకా తీరును అంద‌రూ త‌ప్పుబ‌ట్టారు. ఆ త‌రువాత సీజ‌న్ ముగిసిన వెంట‌నే ల‌క్నో జ‌ట్టు రాహుల్ నువిడుద‌ల చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసింది. ల‌క్నో జ‌ట్టు రాహుల్ కోసం వేలంలో క‌నీసం బిడ్ కూడా వేయ‌లేదు. వేలంలో రిష‌బ్ పంత్‌ను రూ.27 కోట్ల‌కు కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియ‌మించింది.

Virat Kohli : ఆస్ట్రేలియాకు దబిడిదిబిడే.. ప్రాక్టీస్ మొద‌లెట్టిన విరాట్ కోహ్లీ.. గుజ‌రాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్‌తో..

ఇంగ్లాండ్‌లో రాణించిన‌ప్ప‌టికి ల‌క్నో తాజాగా పెట్టిన ఫోటోలో రాహుల్ ను విస్మ‌రించ‌డంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసుకున్నాడు. ల‌క్నోతో రాహుల్ విభేదాలు ఇంకా స‌మ‌సిపోలేద‌ని అంటున్నారు. ఎన్ని విభేదాలు ఉన్న‌ప్ప‌టికి కూడా ఓ ఆట‌గాడు దేశం తరుపున అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్పుడు ప్ర‌శంసించాలని సూచిస్తున్నారు.