క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్ని ప్రమాదం

క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్ని ప్రమాదం

Updated On : August 24, 2019 / 7:04 AM IST

టీమిండియా వెటరన్ క్రికెటర్ శ్రీశాంత్‌కు ఒకటి పోతే ఒకటి అన్నట్లు తయారైంది పరిస్థితి. మొన్నటి వరకూ ఉన్న క్రికెట్ నిషేదం ఎత్తేసి వారం కూడా పూర్తి కాలేదు. అతని ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబంతో పాటు కేరళలో నివాసముంటున్న శ్రీశాంత్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌కు శుక్రవారం అర్థరాత్రి 2గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. అదే సమయంలో శ్రీశాంత్ భార్య, పిల్లలకు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఫైర్ స్టేషన్స్ త్రిక్కక్కరా, గాంధీ నగర్ నుంచి వచ్చిన సిబ్బంది ప్రమాదాన్ని నియంత్రించగలిగారు. 

మంగళవారం వెలువడిన తీర్పును బట్టి బీసీసీఐ అంబుడ్స్‌మన్ అతని జీవిత కాల నిషేదాన్ని కుదించింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ తిరిగి టీమిండియాలో స్థానం దక్కించుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. 87 టెస్టు వికెట్లు పడగొట్టిన శ్రీశాంత్ పునరాగమనంతో 100టెస్టు వికెట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో ఆడేందుకు తాను ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు. 

శ్రీశాంత్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు అయిన అజిత్ చండీలా, అంకిత్ చావన్ లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై వీళ్లు శిక్షను అనుభవించారు. 2013 మే9న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ ను అరెస్టు చేశారు. అతని కెరీర్లో 27 టెస్టులు, 53వన్డేలు, 10అంతర్జాతీయ టీ20లు ఆడి 169వికెట్లు దక్కించుకున్నాడు.