Matheesha Pathirana Injury Update CSK Bowler To Miss MI Clash
Chennai Super Kings : ఐపీఎల్ 2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నైకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ పతిరణ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు లేవని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు.
ఢిల్లీతో ఆడిన మ్యాచ్‌లో పతిరణ గాయపడ్డాడు. ఆ తరువాత సీఎస్‌కే ఆడిన రెండు మ్యాచులకు దూరం అయ్యాడు. ఇందులో సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయిన చెన్నై కేకేఆర్ పై విజయం సాధించింది. ముంబైతో మ్యాచ్ సమయానికి పతిరణ కోలుకుంటాడని భావించారు. అయితే.. అతడు తదుపరి మ్యాచ్‌కు కోలుకుంటాడని ఫ్లెమింగ్ చెప్పాడు.
‘పతిరణ గాయం తీవ్రమైనది కాదు. ముంబైతో మ్యాచ్‌కు అతడు దూరం అయినా కూడా తరువాతి మ్యాచ్‌కు అతడు పూర్తి ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రత్యేక మ్యాచుల్లో అతడు ఎంతో కీలకం. అయితే.. 100 శాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతాడు. ‘అని ఫ్లెమింగ్ చెప్పాడు.
Gautam Gambhir : స్టార్క్‌ను జట్టులోంచి తీసేస్తారా..? గంభీర్ సమాధానం ఇదే..
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెన్నై ఐదు మ్యాచులు ఆడింది. మూడు మ్యాచుల్లో గెలవగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. 6 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అటు ముంబై ఈ సీజన్‌ను హ్యాట్రిక్ ఓటములతో ఆరంభించింది. అయితే.. వరుసగా రెండు విజయాలను సాధించింది. మొత్తంగా ఐదు మ్యాచుల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 36 సార్లు తలపడ్డాయి. ఇందులో 20 సార్లు ముంబై గెలవగా, 16 సార్లు సీఎస్‌కే విజయం సాధించింది. కాగా.. గత రెండు సీజన్లలో ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచులు జరుగగా మూడింట్లో చెన్నై గెలిచింది.
MI vs CSK : ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలను ఊరిస్తున్న భారీ రికార్డులు..