MI vs CSK : ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌ల‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఓ ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది.

MI vs CSK : ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌ల‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు..

MI vs CSK Clash MS Dhoni and Rohit eyes on major record

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఓ ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. ఐదు సార్లు ఛాంపియ‌న్లు అయిన ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలను భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.

ధోని ముంగిన ఉన్న రికార్డులు..

ఈ మ్యాచ్‌లో ధోని మ‌రో నాలుగు ప‌రుగులు చేస్తే చెన్నై త‌రుపున 5వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న రెండో ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు. సీఎస్‌కే త‌రుపున 5వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆట‌గాడు సురేశ్ రైనా. చిన్న త‌లా 5529 ప‌రుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ సీఎస్‌కే త‌రుపున ధోనికి 250వ మ్యాచ్ కావ‌డం విశేషం. ధోని చెన్నై త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు 249 మ్యాచుల్లో 4996 ప‌రుగులు చేశాడు.

Preity Zinta : ‘గెలిచాం.. గెలిచాం.. అయ్యో ఓడిపోయామే..’ ప్రీతీ జింటా ఎక్స్‌ప్రెష‌న్స్ వైర‌ల్‌

రోహిత్ 11 ప‌రుగులు చేస్తే..

హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ మ‌రో 11 ప‌రుగులు చేస్తే.. ముంబై, చెన్నై జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా 30 మ్యాచుల్లో 710 ప‌రుగులు చేయ‌గా రోహిత్ 27 మ్యాచుల్లో 700 ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో ధోని మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

ఐపీఎల్‌లో MI vs CSK మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు..
సురేష్ రైనా – 30 మ్యాచ్‌లలో 710 ప‌రుగులు
రోహిత్ శర్మ- 27 మ్యాచ్‌ల్లో 700 పరుగులు
ఎంఎస్‌ ధోని – 35 మ్యాచుల్లో 655 పరుగులు
కీరన్ పొలార్డ్ – 27 మ్యాచుల్లో 583 పరుగులు
సచిన్ టెండూల్కర్ – 12 మ్యాచ్‌లలో 368 పరుగులు

Yuzvendra Chahal : బ్యాట‌ర్ల సిక్స‌ర్ల పండ‌గ‌.. చాహ‌ల్ ఖాతాలో చెత్త రికార్డు