Preity Zinta : ‘గెలిచాం.. గెలిచాం.. అయ్యో ఓడిపోయామే..’ ప్రీతీ జింటా ఎక్స్‌ప్రెష‌న్స్ వైర‌ల్‌

ముల్లాన్‌పూర్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Preity Zinta : ‘గెలిచాం.. గెలిచాం.. అయ్యో ఓడిపోయామే..’ ప్రీతీ జింటా ఎక్స్‌ప్రెష‌న్స్ వైర‌ల్‌

Preity Zinta Emotional Roller Coaster during PBKS vs RR match Triggers Meme Fest On Internet

Preity Zinta Emotional : ముల్లాన్‌పూర్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు విజ‌యం ఇరు జ‌ట్ల‌తో దోబూచులాడింది. చివ‌రికి రాజ‌స్థాన్‌నే గెలుపు వ‌రించింది. ఆఖ‌ర్లో షిమ్రోన్ హెట్మెయిర్ మెరుపులో పంజాబ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. దీంతో వ‌రుస‌గా రెండో ఓట‌మిని న‌మోదు చేసింది పంజాబ్‌. ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజ‌య‌తీరాల‌కు వ‌చ్చి ఓడిపోవ‌డంతో అభిమానులే కాకుండా ఆ జ‌ట్టు స‌హ య‌జ‌మాని ప్రీతీ జింటా కూడా క‌ల‌త చెందింది.

కాగా.. పంజాబ్  హోం గ్రౌండ్‌లో ఆడే అన్ని మ్యాచుల‌కు దాదాపుగా ప్రీతీ జింటా హాజ‌రు అవుతూ జ‌ట్టును ఉత్సాహ‌ప‌రుస్తూ ఉంటారు అన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌కు హాజ‌రైంది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఓద‌శ‌లో జ‌ట్టు గెలుస్తుంద‌న్న ఆనందంలో ఉన్న ప్రీతీ జింటా చివ‌రికి ఓడిపోవ‌డంతో నిరాశ త‌ప్ప‌లేదు. త‌న నిరాశ‌ను ఆమె దాచుకోలేక‌పోయింది.

Yuzvendra Chahal : బ్యాట‌ర్ల సిక్స‌ర్ల పండ‌గ‌.. చాహ‌ల్ ఖాతాలో చెత్త రికార్డు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో అషుతోష్ శర్మ(16 బంతుల్లో 31) టాప్‌స్కోర‌ర్‌. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో కేశ‌వ్ మ‌హ‌రాజ్‌, ఆవేశ్ ఖాన్‌లు చెరో రెండు, ట్రెంట్ బౌల్ట్‌, కుల్దీద్ సేన్‌, చాహ‌ల్‌లు త‌లా ఓ వికెట్ తీశారు.

అనంత‌రం ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.5 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ (28 బంతుల్లో 39) రాణించ‌గా.. ఆఖ‌ర్లో షిమ్రోన్ హెట్మెయర్ (27నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) లు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో ర‌బాడ‌, సామ్ క‌ర్ర‌న్ లు చెరో రెండు, అర్ష్‌దీప్ సింగ్‌, లివింగ్ స్టోన్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

ధోని స్టైల్‌లో.. సంజూ శాంస‌న్ స్ట‌న్నింగ్ ర‌నౌట్ వీడియో

ఓట‌మి పై పంజాబ్ కెప్టెన్ సామ్ క‌ర్ర‌న్ మాట్లాడుతూ.. పిచ్ నెమ్మ‌దిగా ఉంద‌న్నాడు. బ్యాటింగ్‌లో శుభారంభం అందుకోలేక‌పోయాం. ‘బౌలింగ్‌లో స‌రైన ముగింపు ఇవ్వ‌లేక‌పోయాం. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో బ్యాట‌ర్లు రాణించ‌డంతో పోరాడే ల‌క్ష్యం ద‌క్కింది. ఈ ఓట‌మిని జీర్ణించుకోవ‌డం క‌ష్ట‌మే. అయిన‌ప్ప‌టికీ కుర్రాళ్లు ఆడిన తీరు అద్భుతం.’ అని క‌ర్ర‌న్ అన్నాడు.