మిచెల్ స్టార్క్‌ను జ‌ట్టులోంచి తీసేస్తారా..? గంభీర్ స‌మాధానం ఇదే..

ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ వేలంలో రూ.24.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి మ‌రీ ఆస్ట్రేలియా స్టార్‌ పేస‌ర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ సొంతం చేసుకుంది.

మిచెల్ స్టార్క్‌ను జ‌ట్టులోంచి తీసేస్తారా..? గంభీర్ స‌మాధానం ఇదే..

Gautam Gambhir Honest Response on Mitchell Starc Poor Show In IPL 2024

Gautam Gambhir – Mitchell Starc : ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ వేలంలో రూ.24.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి మ‌రీ ఆస్ట్రేలియా స్టార్‌ పేస‌ర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ ధ‌ర‌కు అత‌డు న్యాయం చేయ‌లేక‌పోతున్నాడు. అత‌డి ప్ర‌ద‌ర్శ‌న దారుణంగా ఉంది. 77 స‌గ‌టుతో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు.

దీంతో అత‌డి పై వేటు వేయాల‌ని అభిమానులు కోరుతున్నారు. కాగా..ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా నేడు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నున్న నేప‌థ్యంలో కేకేఆర్ మెంటార్ గౌత‌మ్ గంభీర్ మీడియాతో మాట్లాడాడు. మిచెల్ స్టార్క్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడాడు. అత‌డిపై పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. గ‌ణాంకాల‌ను పట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు.

Also Read : ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌ల‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు..

టీ20ల్లో బౌల‌ర్ల‌పై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించ‌డం స‌హ‌జ‌మేన‌ని చెప్పాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచులు ఆడామ‌ని, ఇందులో మూడు మ్యాచుల్లో విజ‌యం సాధించామ‌న్నాడు. క్రికెట్ మ్యాచ్‌లో గెలిచామా లేదా అన్న‌దే ముఖ్య‌మ‌న్నాడు. ఈ నాలుగు మ్యాచుల్లో స్టార్క్ రాణించ‌నంత మాత్రాన అత‌డేమీ చెడ్డ బౌల‌ర్ కాద‌న్నాడు.

అత‌డు ఒక్క‌సారి ఫామ్ అందుకుంటే ఎంత ప్ర‌మాద‌క‌ర బౌల‌రో మ‌నంద‌రికి తెలుసున‌ని చెప్పుకొచ్చాడు. త‌దుప‌రి మ్యాచుల్లో అత‌డు రాణిస్తాడ‌నే విశ్వాసాన్ని గంభీర్ వ్య‌క్తం చేశాడు.

కోల్‌క‌తా ఈ సీజ‌న్‌లో నాలుగు మ్యాచులు ఆడ‌గా మూడు మ్యాచుల్లో గెలుపొందింది. 6 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. కాగా.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ల‌క్నోతో కేకేఆర్ మూడు సంద‌ర్భాల్లో త‌ల‌ప‌డింది. అన్నింటిలో కూడా ల‌క్నోనే విజయం సాధించింది.

Also Read: బ్యాట‌ర్ల సిక్స‌ర్ల పండ‌గ‌.. చాహ‌ల్ ఖాతాలో చెత్త రికార్డు