Mayank Yadav placed in special camp in NCA ahead of Bangladesh T20Is
ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి మయాంక్ యాదవ్ అందరి దృష్టిలో పడ్డాడు. అతడి స్పీడును చూసిన చాలా మంది అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. అతడు గాయపడడంతో ఆటకు దూరం అయ్యాడు. ప్రస్తుతం గాయం కోలుకుని వచ్చిన మయాంక్ తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. కాగా.. అతడికి బీసీసీఐ బెంగళూరులోని ఎన్‌సీఏలో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపులో చోటు కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా.. టీమ్ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడుతోంది. టెస్టు సిరీస్ ముగిసిన తరువాత అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్లు టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ సిరీస్‌లో మయాంక్‌కు చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లుగా క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
IND vs BAN : ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రద్దు..
టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టు జింబాబ్వే, శ్రీలంకలతో టీ20 సిరీస్‌లు ఆడింది. ఈ రెండు సిరీస్‌లకు మయాంక్ యాదవ్ ఎంపిక అయ్యాడు. అయితే.. గాయంతో ఈ సిరీస్‌లు ఆడలేకపోయాడు. ప్రస్తుతం ఎన్‌సీఏ ఉన్న మయాంక్.. అక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా.. టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీమోర్కెల్‌లకు మయాంక్ యాదవ్ బౌలింగ్ గురించి పూర్తిగా తెలుసు. ఐపీఎల్ లో లక్నో తరుపున మయాంక్ ఆడిన సమయంలో వీరిద్దరు ఆ జట్టు కోచింగ్ బృందంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ స్పీడ్ స్టర్‌ను బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి.