IND vs BAN : ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రద్దు..
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటను రద్దు చేశారు.

India vs Bangladesh 2nd Test Day 2 Play called off due to rain
అనుకున్నట్లుగా జరిగింది. కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటను రద్దు చేశారు. వర్షం కారణంగా రెండో రోజు ఒక్క బంతి కూడా పడలేదు. ఇక తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆదివారం కూడా స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మూడో రోజు మ్యాచ్ జరిగే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి.
అయితే.. నాలుగో రోజు సోమవారం, ఐదో రోజు మంగళవారం మాత్రం ఎలాంటి వర్షం ముప్పు లేదు. ఈ రెండు రోజులు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మరి రెండు రోజుల్లో ఫలితం వస్తుందా రాదో చూడాల్సిందే.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ కాన్పూర్ మ్యాచ్‌లోనూ విజయం సాధించి తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసిన సమయంలో వర్షం కురవడంతో తొలి రోజు మిగిలిన ఆటను రద్దు చేశారు. ఇక రెండో రోజు ఉదయం నుంచే వర్షం కురవడంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఒక్కసారి కూడా కవర్లను తొలగించలేదు.
SL vs NZ : 2, 9, 7, 8, 10, 13, 1, 0, 29, 2, 2.. ఏందన్నా ఇదీ న్యూజిలాండ్ ఫోన్ నెంబర్!
Update from Kanpur 🚨
Play has been called off for Day 2 due to rains.#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HD98D6LK9K
— BCCI (@BCCI) September 28, 2024