×
Ad

Lionel Messi sister : రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ మెస్సీ సోద‌రి మరియా సోల్‌.. పెళ్లి వాయిదా..!

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ సోదరి మరియా సోల్ మెస్సీ (Lionel Messi sister) రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డింది

Miami car crash Lionel Messi sister hospitalised wedding postponed

Lionel Messi sister : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ సోదరి మరియా సోల్ మెస్సీ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డింది. మయామిలో ఆమె ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో మరియా సోల్ మెస్సీ తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘ‌ట‌న కార‌ణంగా జ‌న‌వ‌రి ప్రారంభంలో జ‌ర‌గాల్సిన ఆమె వివాహం వాయిదా ప‌డింది.

అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. 32 ఏళ్ల మరియా సోల్ మెస్సీ ఈ రోజు ఉద‌యం త‌న ఎస్‌యూవీ కారులో వెలుతోంది. అయితే.. వాహ‌నం పై ఆమె నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో వాహ‌నం అదుపుత‌ప్పి ఓ గోడ‌ను ఢీ కొట్టింది.

Virat Kohli : విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆంధ్ర‌తో ఢిల్లీ మ్యాచ్‌.. అరుదైన రికార్డు పై కోహ్లీ క‌న్ను.. ఒక్క ప‌రుగు చేస్తే..

ఈ ఘ‌ట‌న‌లో మెస్సీ సోద‌రికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. ఆమె వెన్నుముఖ‌, మ‌డిమ‌, మ‌ణిక‌ట్టు వ‌ద్ద ప‌గుళ్లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అలాగే గాలిన గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది.

Gede Priandana : అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అద్భుతం.. ఒకే ఓవ‌ర్‌లో ఐదు వికెట్లు తీసిన ఇండోనేషియా బౌల‌ర్‌..

అయితే. అదృష్ట‌వశాత్తు ఈ ప్ర‌మాదం నుంచి ఆమె ప్రాణాల‌తో బ‌య‌టిప‌డిన‌ట్లు క‌థ‌నాలు పేర్కొన్నాయి. ప్ర‌స్తుతం ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న కార‌ణంగా జ‌న‌వ‌రి 3న జ‌ర‌గాల్సిన ఆమె వివాహం వాయిదా ప‌డింది.