Mitchell Owen links up with Punjab Kings leaves PSL midway
శనివారం నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త అందింది. ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు, ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ పంజాబ్ జట్టులో చేరాడు. గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమైన మాక్స్‌వెల్ స్థానంలో పంజాబ్ మిచెల్‌ను తీసుకుంది.
జట్టులో చేరిన మిచెల్‌ను గురువారం నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మిగిలిన ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Rohit Sharma : శనివారం నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం.. భారీ రికార్డు పై రోహిత్ శర్మ కన్ను.. ఇంకో 72..
పీఎస్ఎల్‌ను వదులుకుని..
ఐపీఎల్ మెగావేలంలో మిచెల్ ఓవెన్‌ను ఎవరూ తీసుకోలేదు. ఈ క్రమంలో అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో పాల్గొన్నాడు. అతడు పెషావల్ జల్మి జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. భారత్, పాక్ ఉద్రిక్తల కారణంగా పీఎస్ఎల్ సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. పీఎస్ఎల్ లో మ్యాచ్‌లు కూడా శనివారం నుంచే మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మిచెల్ పాక్ వెళతాడని చాలా మంది భావించగా అతడు మాత్రం పీఎస్ఎల్ ను విడిచిపెట్టి ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు వచ్చాడు.
Punter setting the tone 🗣️ pic.twitter.com/KXbXOVknlw
— Punjab Kings (@PunjabKingsIPL) May 15, 2025
ఎవరీ మిచెల్ ఓవెన్..?
ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ ఓవెన్ విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. బిగ్‌బాష్ లీగ్ 2024-25 సీజన్‌లో పరుగులు వరద పారించాడు. ఈ సీజన్‌లో ఏకంగా 452 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓ మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +0.376గా ఉంది.