WTC 2025 prize Money : డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని ప్రకటించిన ఐసీసీ.. ఫైనల్‌కు చేరకున్నా భారత్‌కు ఎన్ని కోట్లంటే? విజేతకు ఎంతంటే?
ఐసీసీ డబ్ల్యూటీసీ 2025 ప్రైజ్‌మనీని ప్రకటించింది.

ICC announces highest ever prize money pool for WTC 2025 final
ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని ప్రకటించింది. గత రెండు ఎడిషన్‌లతో పోలిస్తే ఈ సారి రెండింతలు ఎక్కువగా ప్రైజ్‌మనీ ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కేటాయించిన మొత్తం 5.76 మిలియన్ డాలర్లు అని ఐసీసీ తెలిపింది. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.49.27 కోట్లకు సమానం. విజేతగా నిలిచిన జట్టుకు 3.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.30.78 కోట్లు), రన్నరప్‌గా నిలిచిన జట్లు 2.1 మిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.18.46) దక్కనుంది.
IPL 2025 : మరో రెండు రోజుల్లో ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్‌సీబీకీ లడ్డూలాంటి న్యూస్..
డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు సైతం భారీ మొత్తమే అందనుంది. 1.44 మిలియన్ల అంటే భారత కరెన్సీలో సుమారు రూ.12.31 కోట్లు అందనుంది. ఇక నాలుగో స్థానంలో నిలిచి న్యూజిలాండ్ కు 1.2 మిలియన్ డాలర్లు దక్కనుంది.
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 ఫైనల్లో గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ల డాలర్ల (రూ. 13.68 కోట్లు) ప్రైజ్‌మనీగా దక్కింది. రన్నరప్ టీమిండియాకు 8 లక్షల డాలర్లు (రూ. 6.84 కోట్లు) లభించింది.
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ ప్రైజ్‌మనీ వివరాలు..
విజేతకు – 3.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.30.78 కోట్లు)
రన్నరప్‌కు – 2.16 మిలియన్ డాలర్లు (రూ.18.46 కోట్లు)
మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు – 1.4 మిలియన్ల డాలర్లు (రూ.12.31 కోట్లు)
నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ కు – 1.2 మిలియన్ల డాలర్లు (రూ.10.26కోట్లు)
ఐదో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ కు – 9,60000 డాలర్లు (రూ.8.78 కోట్లు)
ఆరో స్థానంలో నిలిచిన శ్రీలంకకు – 8,40,000 డాలర్లు (రూ.7.18 కోట్లు)
ఏడో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌కు -7,20,000 డాలర్లు (రూ.6.15 కోట్లు)
ఎనిమిదో స్థానంలో నిలిచిన వెస్టిండీస్‌కు – 6,00,000 డాలర్లు (రూ.5.13 కోట్లు)
తొమ్మిదో స్థానంలో నిలిచిన పాకిస్తాన్‌కు – 4,80,000 డాలర్లు (రూ.4.10 కోట్లు)