IPL 2025 : ఇదేందయ్యా ఇది మరీనూ.. ఒక్క రోజులోనే ఇంత మార్పా.. ఫ్రాంచైజీల నెత్తిన పాలు పోసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు..
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు శుభవార్త చెప్పింది.

South Africa Make Stunning World Test Championship Final U Turn Ahead Of IPL 2025 Resumption
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ శనివారం (మే 17) నుంచి రీ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు శుభవార్త చెప్పింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ 2025) ఫైనల్‌కు ఎంపికైన ఐపీఎల్‌లో ఆడే సఫారీ ఆటగాళ్లు మే 26 నాటికి స్వదేశానికి రావాలని తొలుత దక్షిణాకా ఫ్రిఅధికారులు ప్రకటించారు. తమ ప్రాధాన్యం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మాత్రమే అని ఐపీఎల్‌కు కాదనీ చెప్పారు.
అయితే.. అంతలోనే యూటర్న్ తీసుకున్నారు. తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సన్నాహక సమయాన్ని తగ్గించుకుంటున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా (CSA) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఎనోచ్ న్క్వే సిడ్నీ తెలిపారు. తమ షెడ్యూల్‌లో ఓ సవరణ చోటు చేసుకుందని, జూన్ 3 నుంచి తాము డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం సన్నాహకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీంతో సఫారీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు మార్గం సుగగమైంది.
వాస్తవానికి జూన్ 3న దక్షిణాఫ్రికా జట్టు జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15 మధ్య ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది.
ఈ నిర్ణయం వల్ల కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), లుంగి ఎంగిడి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఐడెన్ మార్‌క్రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), ర్యాన్ రికెల్టన్ (ముంబయి ఇండియన్స్), కార్బిన్ బాష్ (ముంబయి ఇండియన్స్), మార్కో జాన్సన్ (పంజాబ్ కింగ్స్), వియాన్ ముల్డర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) తమ తమ ఐపీఎల్ జట్లకు మ్యాచ్‌లు పూర్తి అయ్యేవరకు అందుబాటులో ఉండనున్నారు.