Faf Du Plessis : చరిత్ర సృష్టించిన ఫాఫ్ డుప్లెసిస్.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడు ఇతడే.. ఎవ్వరి వల్ల కాలేదు..
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు.

MLC 2025 Faf Du Plessis Becomes First Player In The World To Achieve this Feat
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 40 ఏళ్లు దాటిన తరువాత రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరుపున ఆడుతూ ఎంఐ న్యూయార్క్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు.
మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్‌లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్, ఎంఐ న్యూయార్క్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కింగ్స్ కెప్టెన్ అయిన డుప్లెసిస్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో నలభై ఏళ్లు దాటిన తర్వాత రెండు టీ20 శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ వయసులోనూ ఫిట్‌గా ఉంటూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటమే గాక.. సెంచరీలతో అలరిస్తూ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం..
టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు డుప్లెసిస్. టీ20ల్లో అతడికి ఇది ఎనిమిదో శతకం. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు క్రిస్‌గేల్ పేరిట ఉంది. గేల్ టీ20ల్లో 22 శతకాలు బాదాడు. ఆ తరువాత 11 శతకాలతో బాబర్ ఆజామ్ రెండో స్థానంలో నిలిచాడు.
టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
క్రిస్‌గేల్ – 22 శతకాలు
బాబర్ ఆజామ్ -11 శతకాలు
విరాట్ కోహ్లీ, రిలీ రూసో – 9 శతకాలు
రోహిత్ శర్మ, ఆరోన్ పించ్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ -8 శతకాలు
ENG vs IND : రెండో టెస్టుకు ముందు పంత్‌ను ఊరిస్తున్న రికార్డు ఇదే.. కోహ్లీని అధిగమించే ఛాన్స్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డుప్లెసిస్ శతకంతో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 184 పరుగులకే పరిమితమైంది. దీంతో కింగ్స్ 39 పరుగుల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంది.