MCL 2025 : 7 మ్యాచ్‌ల్లో 6 ఓట‌మి.. ఏ టోర్న‌మెంట్ అయినా ఎంఐ అంత త్వ‌ర‌గా నిష్ర్క‌మించ‌దు.. నికోల‌స్ పూర‌న్ కామెంట్స్‌..

మేజ‌ర్ క్రికెట్ లీగ్ 2025 సీజ‌న్‌లో ఎంఐ న్యూయార్క్ ఫ్రాంచైజీ ప్ర‌యాణం ఏమంత గొప్ప‌గా లేదు.

MCL 2025 : 7 మ్యాచ్‌ల్లో 6 ఓట‌మి.. ఏ టోర్న‌మెంట్ అయినా ఎంఐ అంత త్వ‌ర‌గా నిష్ర్క‌మించ‌దు.. నికోల‌స్ పూర‌న్ కామెంట్స్‌..

MCL 2025 MI franchise is never out of any tournament everyone knows it says Nicholas Pooran

Updated On : June 30, 2025 / 12:51 PM IST

మేజ‌ర్ క్రికెట్ లీగ్ 2025 సీజ‌న్‌లో ఎంఐ న్యూయార్క్ ఫ్రాంచైజీ ప్ర‌యాణం ఏమంత గొప్ప‌గా లేదు. టెక్సాస్ సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎంఐ 39 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజ‌న్‌లో ఇది ఎంఐకి ఏడు మ్యాచ్‌ల్లో ఆరో ఓట‌మి కాగా.. వ‌రుస‌గా నాలుగో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 223 ప‌రుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (103; 53 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) శ‌త‌కం బాదాడు. ఎంఐ బౌల‌ర్ల‌లో రుషిల్‌ ఉగార్కర్‌, జార్జ్ లిండే చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. 224 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎంఐ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి 184 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. కీర‌న్ పొలార్డ్ (70; 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) రాణించినా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు.

ENG vs IND : రెండో టెస్టుకు ముందు పంత్‌ను ఊరిస్తున్న రికార్డు ఇదే.. కోహ్లీని అధిగ‌మించే ఛాన్స్‌

ఇక ఈ మ్యాచ్ అనంత‌రం ముంబై ఇండియ‌న్స్‌ న్యూయార్క్ కెప్టెన్ నికోల‌స్ పూర‌న్ మాట్లాడుతూ.. ఈ ఓట‌మి బాధించింద‌ని చెప్పాడు. ‘ఈ టోర్న‌మెంట్ అంత‌టా మా బౌల‌ర్లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌యారు. ఈ మ్యాచ్‌లో మిడిల్ ఓవ‌ర్ల‌లో బాగానే వేశారు. అయితే.. ఫాఫ్ డుపెస్లిస్ త‌న అనుభ‌వాన్ని అంతా ఉప‌యోగించి అద్భుతంగా ఆడాడు. మా బౌల‌ర్లు ధారాళంగా ప‌రుగులు ఇచ్చేశారు.’ అని పూర‌న్ అన్నాడు.

ఇక ల‌క్ష్య ఛేద‌న‌లో కీర‌న్ పొలార్డ్ చాలా చ‌క్క‌గా ఆడాడ‌ని మెచ్చుకున్నాడు. ‘ఈ పిచ్ పై అత‌డు మాకు ఎలా బ్యాటింగ్ చేయాలో చూపించాడు. అత‌డు చాలా ఈజీగా ప‌రుగులు రాబ‌ట్టాడు. టీ20 క్రికెట్ అనేది మూమెంట్‌తో కూడుకున్న‌ది. ఒక్క విజ‌యం ప‌రిస్థితుల‌ను అన్నింటిని మారుస్తుంది. ఎంఐ ఈ టోర్న‌మెంట్ నుంచి ఇంకా నిష్ర్క‌మించ‌లేదు. ఏ టోర్న‌మెంట్ అయినా ఎంఐ అంత త్వ‌ర‌గా నిష్ర్క‌మించ‌దు. ఈ విష‌యం అంద‌రికి తెలుసు. ఖ‌చ్చితంగా మేము ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాం.’ అని పూర‌న్ తెలిపాడు.

Team India : హ్యాపీ రిటైర్‌మెంట్ జ‌డేజా.. రెండు కేక్‌లు క‌ట్ చేసిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు..

మేజ‌ర్ క్రికెట్ లీగ్ 2025 సీజ‌న్‌లో ఇప్ప‌టికే మూడు జ‌ట్లు ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం ఎంఐతో పాటు మ‌రో రెండు జ‌ట్లు కూడా పోటీలో ఉన్నాయి. అయితే.. మిగిలిన రెండు జ‌ట్ల‌తో పోలిస్తే ఎంఐ ర‌న్‌రేట్ మెరుగ్గా ఉండ‌డం సానుకూలాంశం. ఈ సీజ‌న్‌లో ఎంఐ మ‌రో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. జూలై 3, 5 తేదీల్లో నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుండ‌గా, జూలై 6న వాషింగ్ట‌న్ ప్రీడ‌మ్‌తో ఆడ‌నుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధిస్తే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి.