Trent Boult : స్పాట్ ఫిక్సింగ్..! ఒకే జట్టు పై రెండు సార్లు విచిత్ర రీతిలో ట్రెంట్ బౌల్ట్ రనౌట్.. వీడియో వైరల్..
టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విచిత్ర రీతిలో రనౌట్ అయ్యాడు ట్రెంట్ బౌల్ట్.

MLC 2025 Trent Boult twin blunders spark spot fixing storm
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్‌లో ఆడుతున్నాడు. అతడు ముంబై న్యూయార్క్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఈ సీజన్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విచిత్ర రీతిలో రనౌట్ అయ్యాడు. దీంతో అతడి పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.
రెండు వారాల క్రితం టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో ఎంఐ న్యూయార్క్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్ కివీస్ ఫాస్ బౌలర్ ఊహించని విధంగా రనౌట్ అయ్యాడు. ఆడమ్ మిల్నే వేసిన బంతిని తాజిందర్ ధిల్లాన్ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బ్యాటర్లు సింగిల్ పూర్తి చేసుకున్నారు. స్ట్రైకింగ్‌కు ఎండ్‌కు చేరుకున్న బౌల్ట్ రెండో పరుగు కోసం పిలుపునిచ్చాడు. అయితే.. తొందరలో తన బ్యాట్‌ను వదిలేశాడు. అతడు క్రీజులో వచ్చాడు.
What were you doing Trent Boult 😭 pic.twitter.com/eoZAsD3FLa
— 🎰 (@StanMSD) June 14, 2025
ఫీల్డర్ బంతిని కీపర్‌కు విసిరేశాడు. అయినప్పటికి రెండో పరుగు కోసం యత్నించాడు. మరో బ్యాటర్ వద్దు అనడంతో మళ్లీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేయగా.. కీపర్ వికెట్లను గీరాటేశాడు. దీంతో బౌల్ట్ రనౌట్ అయ్యాడు.
ఇక జూన్ 29న టెక్సాస్ సూపర్ కింగ్స్, ఎంఐ న్యూయార్క్ జట్లు మరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ ట్రెంట్ బౌల్ట్ మరోసారి ఇలాంటి తప్పే శాడు. మార్కస్ స్టోయినిస్ చక్కని యార్కర్ వేయగా బౌల్ట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి అతడి కాలిని తగిలి వెనక్కి వెళ్లింది.
బంతి ఎక్కడికి వెళ్లిందో సరిగ్గా గమనించని బౌల్ట్ పరుగు కోసం ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ వద్దు అని చెప్పడంతో మళ్లీ వెనక్కి తిరిగి క్రీజును చేరేందుకు ప్రయత్నించాడు. వెంటనే కీపర్ స్టంప్స్‌ను పడగొట్టడంతో బౌల్ట్ రనౌట్ అయ్యాడు. ఈ సమయంలో బౌల్ట్ నిర్లక్ష్యంగా ఉన్నట్లు అర్థమవుతోంది.
Shreyas Iyer : అమ్మచేతిలో శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్.. నెట్టింట మీమ్స్ వైరల్..
Boult did it again 😂pic.twitter.com/shWqllaBj3 https://t.co/iZp3MsLudH
— 🎰 (@StanMSD) June 30, 2025
దీంతో బౌల్ట్ కావాలనే టెక్సాప్ పై రనౌట్లు అవుతున్నాడని కొందరు నెటిజన్లు అంటున్నారు. అతడు స్పాట్ ఫిక్సింగ్‌కు ఏమైనా పాల్పడుతున్నాడేమోననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈ సీజన్‌లో ఎంఐ ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.