Shreyas Iyer : అమ్మచేతిలో శ్రేయస్‌ అయ్యర్‌ క్లీన్‌ బౌల్డ్‌.. నెట్టింట మీమ్స్ వైర‌ల్‌..

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక కాక‌పోవ‌డంతో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ప్ర‌స్తుతం కాస్త విరామం ల‌భించింది.

Shreyas Iyer : అమ్మచేతిలో శ్రేయస్‌ అయ్యర్‌ క్లీన్‌ బౌల్డ్‌.. నెట్టింట మీమ్స్ వైర‌ల్‌..

Shreyas Iyer Mother CleanBowled his Son At Home video viral

Updated On : July 1, 2025 / 9:53 AM IST

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక కాక‌పోవ‌డంతో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కు ప్ర‌స్తుతం కాస్త విరామం ల‌భించింది. ఈ స‌మ‌యాన్ని అత‌డు త‌న కుటుంబంతో స‌ర‌దాగా గ‌డిపేందుకు ఉప‌యోగిస్తున్నాడు. త‌న త‌ల్లితో క‌లిసి ఇంట్లో క్రికెట్ ఆడుతున్నాడు.

అయ్య‌ర్ బ్యాటింగ్ చేస్తుండ‌గా అత‌డి తల్లి బౌలింగ్ చేస్తోంది. త‌ల్లి వేసిన బంతిని మిస్ చేసిన వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో అయ్య‌ర్ పంచుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా నాయ‌కుడు ఇప్పుడు మాత్రం బౌల్ట్ అయినా ప‌ట్టించుకోడ‌ని ఫ‌న్నీగా కామెంట్ చేసింది.

Kavya Maran : ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన కావ్య మార‌న్‌.. ఐపీఎల్‌లో త‌న మీమ్స్ , రియాక్ష‌న్స్ గురించి..

ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ENG vs IND : భార‌త్‌తో రెండో టెస్టు.. 48 గంట‌ల ముందుగానే తుది జ‌ట్టును ప్ర‌క‌టించిన ఇంగ్లాండ్‌.. స్టార్ పేస‌ర్‌కు నో ఛాన్స్‌..

శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలో ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ ఫైన‌ల్ చేరుకుంది. అయితే.. ఫైన‌ల్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయి తృటిలో క‌ప్పును చేజార్చుకుంది.