ENG vs IND : భార‌త్‌తో రెండో టెస్టు.. 48 గంట‌ల ముందుగానే తుది జ‌ట్టును ప్ర‌క‌టించిన ఇంగ్లాండ్‌.. స్టార్ పేస‌ర్‌కు నో ఛాన్స్‌..

బుధ‌వారం నుంచి భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది

ENG vs IND : భార‌త్‌తో రెండో టెస్టు.. 48 గంట‌ల ముందుగానే తుది జ‌ట్టును ప్ర‌క‌టించిన ఇంగ్లాండ్‌.. స్టార్ పేస‌ర్‌కు నో ఛాన్స్‌..

ENG vs IND 2nd Test ECB announced England Playing XI 48 hours berofe the match

Updated On : July 1, 2025 / 8:52 AM IST

బుధ‌వారం నుంచి భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాల‌ని ఇరు జ‌ట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఎలాగైనా రెండో టెస్టులో గెలిచి సిరీస్ స‌మం చేయాల‌ని భార‌త్ పట్టుద‌ల‌గా ఉండ‌గా తొలి టెస్టులో విజ‌యం సాధించిన ఇంగ్లాండ్ అదే జోష్‌ను కొన‌సాగించాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలో మ్యాచ్‌కు 48 గంట‌ల ముందుగానే త‌మ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది ఇంగ్లాండ్‌.

గాయాల‌తో దాదాపు చాలా కాలం పాటు దూర‌మై రెండో టెస్టుకు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్‌కు తుది జ‌ట్టులో చోటు ఇవ్వ‌లేదు. విన్నింగ్ కాంబినేష‌న్ మార్చ‌కూడ‌ద‌ని ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో తొలి టెస్టులో ఆడిన జ‌ట్టుతోనే బరిలోకి దిగ‌నున్నట్లు వెల్ల‌డించింది.

India vs England: వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్.. భారత జట్టుకు బిగ్‌షాకిచ్చిన ఇంగ్లాండ్

కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా జోఫ్రా ఆర్చర్ సోమవారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన శిక్షణా సెషన్‌కు దూరమయ్యాడు కానీ భారత్‌తో జరిగే రెండో టెస్ట్‌కు ముందు మంగళవారం జట్టులో తిరిగి చేరే అవకాశం ఉందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇక‌ తొలి టెస్ట్‌కు దూరమైన ఈ పేసర్‌ను గత వారం ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులో చేర్చిన సంగ‌తి తెలిసిందే.

రెండో టెస్టు మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్ర‌స్తుతం 1-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

Faf Du Plessis : చ‌రిత్ర సృష్టించిన ఫాఫ్ డుప్లెసిస్‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో తొలి ఆట‌గాడు ఇత‌డే.. ఎవ్వ‌రి వ‌ల్ల కాలేదు..

రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జ‌ట్టు ఇదే..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.