Mohammed Shami post after missing squad for Australia
Mohammed Shami : ఆస్ట్రేలియా పర్యటనకు సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయలేదు. గాయం తిరగబెట్టడంతో అతడిని సెలక్టర్లు పక్కన బెట్టారు. అయితే.. ఆసీస్ పర్యటనకు మరో రెండు వారాలకు పైగా సమయం ఉంది. ఈ క్రమంలో షమీ తన ఫిట్‌నెస్ ను నిరూపించుకుంటే అతడిని ఎంపిక చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో షమీ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
క్రికెట్ అభిమానులకు, బీసీసీఐకి షమీ క్షమాపణలు చెప్పాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘బౌలింగ్ ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాను. మ్యాచ్ కోసం సన్నద్ధం అయ్యేందుకు మరింత శ్రమిస్తాను. దేశవాలీ క్రికెట్ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాను. క్రికెట్ అభిమానులకు, బీసీసీఐకి క్షమాపణలు.’ అని షమీ తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్ ఆడేందుకు త్వరలోనే వస్తానని చెప్పుకొచ్చాడు.
PAK vs ENG : బాబర్ ఆజామ్ లేకుండానే టెస్టు సిరీస్ గెలిచిన పాకిస్థాన్.. బాబర్ ఏమన్నాడంటే?
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ తరువాత చీలమండల గాయంతో షమీ జట్టుకు దూరం అయ్యాడు. శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దులీప్ ట్రోఫీ నాటికే ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికి మళ్లీ మోకాలిలో వాపు కనిపించడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడిని కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాలేదు. ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకునే పనిలో ఉన్నాడు.
నవంబర్ 6 నుంచి రంజీట్రోపీ నాలుగో రౌండ్ మ్యాచులు ఆరంభం కానున్నాయి. ఇందులో పాల్గొని షమీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే ఆసీస్ పర్యటనకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి.
IND vs NZ : సిరీస్ ఓటమి నేపథ్యంలో కీలక నిర్ణయం.. సీనియర్లకు గంభీర్ షాక్..!