Moradabad cricketer dies final delivery dies on pitch during match
Ahmar Khan : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ బౌలర్ పిచ్ పై కుప్పకూలిపోయి మరణించాడు. ఈ ఘటన మొరాదాబాద్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ టో చోటు చేసుకుంది. అహ్మర్ ఖాన్ (Ahmar Khan) అనే బౌలర్ మ్యాచ్ చివరి బంతి వేసి తన జట్టును గెలిపించి గుండెపోటుతో కన్నుమూశాడు.
బిలారిలోని చక్కెర మిల్లు మైదానంలో యుపి వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా మొరాదాబాద్, సంభాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొరాదాబాద్ జట్టు తరుపున అహ్మర్ ఖాన్ ఆడాడు. మొరాదాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆ తరువాత సంభాల్ జట్టు లక్ష్యాన్ని ఛేదనకు దిగింది. ఆఖరి ఓవర్‌లో చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు చేస్తే సంభాల్ విజేతగా నిలుస్తుంది.
అయితే.. ఆఖరి ఓవర్‌ను ఎడమచేతి వాటం పేసర్ అహ్మర్ ఖాన్ వేశాడు. చివరి ఓవర్‌ను అతడు కట్టుదిట్టంగా వేయడంతో 11 పరుగుల తేడాతో మొరాదాబాద్ విజేతగా నిలిచింది.
చివరి బంతి వేసిన తరువాత..
ఈ మ్యాచ్‌లో అహ్మర్ ఖాన్ చివరి బంతిని వేసిన తరువాత పిచ్ పై కూర్చుకున్నాడు. అతడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వెంటనే కుప్పకూలాడు. తోటి ఆటగాళ్లు, మైదానంలో అందుబాటులో ఉన్న వైద్యుడు అతడికి సీపీఆర్ అందించారు. అతడిలో కొంత కదిలిక రావడంతో వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.
అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ఆటగాళ్లు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.