Morne Morkel appointed as Indias bowling coach
Team India : గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాప్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి అతడి కాంట్రాక్టు మొదలు కానుంది.
బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌తోనే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా తన జర్నీ మొదలు పెట్టనున్నాడు. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య సెప్టెంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌కు మోర్నీమోర్కెల్‌తో మంచి అనుబంధం ఉంది. 2014 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున వీరిద్దరు కలిసి ఆడారు. అప్పుడు గంభీర్ కెప్టెన్ కాగా మోర్నీ ఆటగాడిగా ఉన్నాడు. ఆ సీజన్‌లో కేకేఆర్ విజేతగా నిలిచింది. అంతేకాదు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా గౌతమ్ గంభీర్ పని చేయగా బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ పని చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కోచ్‌గా పని చేసిన అనుభవం మోర్కెల్ సొంతం. కొంతకాలం పాటు అతడు పాకిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మోర్కెల్ దక్షిణాఫ్రికా తరుపున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచులు ఆడాడు. అన్ని ఫార్మాట్లలలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు.