×
Ad

Vaibhav Suryavanshi : ఈ ఏడాది కోహ్లీ కంటే ఎక్కువ‌గా బుడ్డోడినే వెతికారు.. వైభ‌వ్ సూర్య‌వంశీ రియాక్ష‌న్ వైర‌ల్‌

టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi) ఈ ఏడాది గూగుల్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేసిన భార‌తీయ వ్య‌క్తిగా నిలిచాడు.

Most Searched Indian In 2025 Vaibhav Suryavanshi Surpassing Virat Kohli

Vaibhav Suryavanshi : టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ ఏడాది గూగుల్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేసిన భార‌తీయ వ్య‌క్తిగా నిలిచాడు. దిగ్గ‌జ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ వంటి ఆట‌గాళ్ల కంటే 14 ఏళ్ల వైభ‌వ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కోస‌మే చాలా మంది గూగుల్ ను ఆశ్ర‌యించారు. ఇక ఇదే విష‌యాన్ని వైభ‌వ్ సూర్య వంశీ వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా అత‌డు చెప్పిన సమాధానం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ ఏడాది (2025)లో వైభ‌వ్ సూర్యవంశీ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. శుక్ర‌వారం అండ‌ర్‌-19 ఆసియాక‌ప్‌లో యూఏఈతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు 95 బంతుల్లోనే 171 ప‌రుగులు సాధించాడు. ఈ క్ర‌మంలో అండ‌ర్‌-19 ఆసియాక‌ప్‌లో అత్య‌ధిక స్కోరు సాధించిన భార‌త ప్లేయ‌ర్‌గా అత‌డు రికార్డుల‌కు ఎక్కాడు.

Lionel Messi : అరుదైన వ్యాధితో బాధ‌ప‌డిన మెస్సీ.. కష్టాల కడలి నుంచి ప్రపంచ శిఖరాలకు!

ఈ మ్యాచ్ అనంత‌రం 2025లో విరాట్ కోహ్లీ కంటే కూడా అత‌డి కోస‌మే గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన విష‌యాన్ని వైభ‌వ్ సూర్య‌వంశీ దృష్టికి ప్ర‌సార‌కులు తీసుకువ‌చ్చారు.

‘మీకు దీని గురించి తెలియ‌క‌పోవ‌చ్చు. అయితే.. ఈ ఏడాదిలో గూగుల్‌లో భార‌తదేశంలో అత్య‌ధికంగా శోధించ‌బ‌డిన (సెర్చ్‌)వ్య‌క్తి మీరు. కోహ్లీని సైతం అధిగ‌మించారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా శోధించ‌బ‌డిన వ్య‌క్తుల ప‌రంగా ఆరో స్థానంలో నిలిచారు.’ దీనిపై మీ స్పంద‌న ఏంటి అని అడిగారు.

దీనిపై ఆనందాన్ని వ్య‌క్తం చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ, త‌న ఆట‌ను మెరుగుప‌ర‌చుకోవ‌డంపైనే త‌న దృష్టంతా ఉంద‌న్నాడు.

ILT 20 : బ్యాట‌ర్‌ను స్టంపౌట్ చేసేందుకు నిరాక‌రించిన నికోల‌స్ పూర‌న్.. ప్ర‌త్య‌ర్థి మాస్ట‌ర్ ప్లాన్‌.. తాడిని త‌న్నేవాడు ఉంటే..

‘నేను ఇలాంటి విష‌యాల పై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌ను. నా ఆట‌పైనే దృష్టి పెడ‌తాను. వీటి గురించి నేను వింటాను. బాగానే అనిపిస్తూ ఉంటుంది. దీనిని గొప్ప విష‌యంగా భావిస్తాను. అయితే.. దీనిని ఇక్క‌డితో వ‌దిలివేస్తాను. నా ఆట‌ను ఎలా మెరుగుప‌ర‌చుకోవాల‌నే దానిపైనే దృష్టి సారిస్తాను.’ అని సూర్య‌వంశీ అన్నాడు.