Lionel Messi : అరుదైన వ్యాధితో బాధపడిన మెస్సీ.. కష్టాల కడలి నుంచి ప్రపంచ శిఖరాలకు!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి (Lionel Messi) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Lionel Messi suffered from growth hormone deficiency
Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అతడిని ఆరాధిస్తుంటారు. ఇంతలా అభిమానులను సంపాదించుకున్న అతడి జీవిత ప్రయాణం తెలియంది కాదు. కష్టాల కడలి నుంచే అతడి ప్రయాణం మొదలైంది.
అర్జెంటీనాలోని సాంటాఫేలో గల రొసారియోలో 1987 జూన్ 24న మెస్సీ జన్మించాడు. తన నాలుగేళ్ల వయసులోనే తొలి క్లబ్ గ్రాండోలిలో జాయిన్ అయ్యాడు. ఆ తరువాత ఏడేళ్ల వయసులో మెస్సీ వెనెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్‌లో చేరాడు. పదేళ్ల వయసులో అతడు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనే అరుదైన హార్మోన్ లోపంతో బాధపడ్డాడు. దీంతో అతడి ఎదుగుదల ఆగిపోయింది.
Lionel Messi : మెస్సీని ఇండియాకు రప్పించిన శతద్రు ఎవరు?
దీనికి చికిత్సగా ప్రతి రోజు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చేది. అయితే.. వాటి ఖరీదు ఎక్కువ. దీంతో ఈ ఖరీదైన చికిత్సను అతడి కుటుంబం భరించలేకపోయింది. సరిగ్గా అప్పుడే బార్సిలోనా క్లబ్ ముందుకు వచ్చింది. ఆయనకు పూర్తి చికిత్స అందిస్తూ క్లబ్‌లో చేర్చుకోవడానికి ఒప్పందం చేసుకుంది.
చికిత్స అందడంతో మెస్సీ సాధారణ ఎత్తుకు పెరిగి ఫుట్‌బాల్ ఆటలో దిగ్గజ ఆటగాడిగా ఎదిగాడు.
ఫుట్‌బాల్‌లో అతడు సాధించిన ఘనతలు కొన్ని..
మెస్సీ అత్యధికంగా ఎనిమిదిసార్లు బాలన్ డిఓర్ అవార్డులు గెలుచుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ గోల్డ్ మెడల్ సాధించాడు. అర్జెంటీనా సారథిగా 2022లో ఫిఫా వరల్డ్‌కప్ గెలవడం మెస్సీ కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయం.
