మ్యాచ్ ఫిక్సింగ్.. మర్డర్ చేయడం కంటే మహా పాపం: ధోనీ

మ్యాచ్ ఫిక్సింగ్.. మర్డర్ చేయడం కంటే మహా పాపం: ధోనీ

మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం కంటే మర్డర్ చేయడమే చిన్న క్రైమ్ అంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో తన ప్రయాణం గురించి ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు చెప్పాడు. 2013లో మేనేజ్‌మెంట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐపీఎల్‌ నుంచి రెండేళ్ల పాటు నిషేదానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి 2018 సీజన్‌లో అడుగుపెట్టి టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Read Also : ఈ సారి ఐపీఎల్ జరిగేది పాకిస్తాన్‌లో..: పాక్ క్రికెటర్

‘జట్టు మొత్తం ఆ నిందను భరించాం. నేను కూడా. అది చాలా కఠినమైన సమయం. ఫాన్స్ కూడా మాకు విధించిన శిక్షను ఘోరంగా భావించారు. నేనెప్పుడూ చెప్తుండే వాడిని.. ఏ విషయమైతే తీవ్రంగా బాధిస్తుందో అదే శక్తివంతుడ్ని చేస్తుంది’ అని 45 సెకండ్ల డాక్యుమెంటరీ ట్రైలర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ చెప్పుకొచ్చాడు. దాని పేరు ‘సింహగర్జన'(రోర్ ఆఫ్ ద లయన్).

ఈ వివాదంపై ధోనీ ఇంతకుముందెన్నడూ ఎటువంటి కామెంట్లు చేయలేదు. జూలై 2015లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌లు ఐపీఎల్ నుంచి రెండేళ్ల పాటు నిషదానికి గురైయ్యాయి. 2013 సీజన్‌లో గురునాథ్ మియప్పన్, రాజ్ కుంద్రాలు చేసిన బెట్టింగ్ కార్యకలాపాలపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ 12వ సీజన్ 2019 మార్చి 23 నుంచి ఆరంభం కానుంది. 
Read Also : సన్‌రైజర్స్ బంపర్ ఆఫర్: రాజస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు టిక్కెట్లు