MS Dhoni : రిటైర్మెంట్ పై ధోనీ హింట్.. ఐపీఎల్ 2024లో ఆడడంపై ఏమన్నాడంటే..?
టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్ (2007 టీ20, 2011 వన్డే) లను అందించాడు మహేంద్ర సింగ్ ధోని.
![MS Dhoni : రిటైర్మెంట్ పై ధోనీ హింట్.. ఐపీఎల్ 2024లో ఆడడంపై ఏమన్నాడంటే..? MS Dhoni : రిటైర్మెంట్ పై ధోనీ హింట్.. ఐపీఎల్ 2024లో ఆడడంపై ఏమన్నాడంటే..?](https://10tv.in/wp-content/uploads/2023/10/New-Project-4-35.jpg)
MS Dhoni
MS Dhoni IPL future : టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్ (2007 టీ20, 2011 వన్డే) లను అందించాడు మహేంద్ర సింగ్ ధోని. అలాగే ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు విజేతగా నిలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు అయినప్పటికీ కూడా ధోనీ కి ఉండే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగింది అని చెప్పవచ్చు. 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు ఏ స్టేడియంలో మ్యాచ్ ఆడినా కూడా ఫ్యాన్స్ అంతా కూడా ధోనీ నామాన్నే స్మరించారు.
ఐపీఎల్ 2023 సీజనే ధోనీకి ఆఖరిదనే వార్తలు రాగా.. ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ వార్తలను ధోనీ ఖండించాడు. తనకు మరో సీజన్ ఆడాలని ఉన్నట్లు మనసులోని మాటను చెప్పాడు. అయితే.. ఆ సీజన్ మొత్తం మోకాలి గాయంతో బాధపడ్డాడు ధోనీ. ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. కాగా.. ధోనీ వయసు దృష్ట్యా ఐపీఎల్ 2024 సీజన్ నాటికి పూర్తిగా కోలుకోవడం కష్టమేనని, అతడిని ఇక మైదానంలో చూడలేమని పలువురు క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
Mohammad Rizwan : దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఘనత
తాజాగా బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేంద్రుడు.. ఐపీఎల్ 2024లో ఆడతాడా..? లేదా..? అనే దానిపై హింట్ ఇచ్చేశాడు. ధోనీ మీరు రిటైర్మెంట్ అవుతున్నారా..? అని హోస్ట్.. కెప్టెన్ కూల్ ని అడిగాడు. వెంటనే ధోనీ మాట్లాడుతూ.. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రమే రిటైర్మెంట్ అయ్యానని అన్నాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఈలలతో పాటు బిగ్గరగా అరిచారు. వారి పై వైపు చూస్తూ ధోనీ ఓ చిన్న నవ్వు నవ్వాడు. చిరునవ్వుతోనే తాను ఐపీఎల్ 2024లో ఆడుతాను అని ధోనీ అభిమానులకు హింట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Thala Dhoni provides update on playing IPL 2024 and his knee surgery! 😍💛💥@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/Nffu5Co2f1
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) October 26, 2023