గత కొన్నాళ్లుగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎక్కడ కనిపించినా కూడా అతడికి ఒకే ఒక ప్రశ్న ఎదురువుతుంది. ఆ ప్రశ్నకు ధోని కూడా ఒకేలా సమాధానం ఇస్తూ వస్తున్నారు. ఇంతకి ఆ ప్రశ్న ఏంటంటే.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడతారా? ఆడరా? అని. ఇక ధోని కూడా ఐపీఎల్ సీజన్‌కు చాలా సమయం ఉందని చెబుతూ.. ప్రారంభానికి ముందు నిర్ణయం తీసుకుంటానని అంటూనే ఉన్నాడు.
తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోని పాల్గొన్నాడు. ఈ సమయంలో సీఎస్‌కే జట్టుతో తనకు ఉన్న అనుబంధం పై స్పందించాడు. తాను సీఎస్‌కే తరుపున ఆడినా, ఆడకపోయినా కూడా ఆ జట్టుతో ఎన్నటికి అనుబంధం కొనసాగుతూనే ఉంటుందన్నాడు.
‘మళ్లీ పసుపు రంగు జెర్సీలో కనబడతారా? అని మీరు అడిగితే.. నేను చెప్పే సమాధానం ఒకటే. వచ్చే సీజన్ ఆడడంపై నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉంది. ఇక నేను ఆడతానా? ఆడనా అనేది వేరే విషయం. ఎప్పటికి సీఎస్‌కేతో కలిసే ఉంటా. అది వచ్చే 15 లేదా 20 సంవత్సరాలు అయిన కావొచ్చు.’ అని ధోని అన్నాడు.
MS Dhoni – “Virat Kohli is the ultimate entertainment package”. 😂❤️pic.twitter.com/hC8YXgySea
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 7, 2025
APL : శుక్రవారం నుంచే ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. అంబాసిడర్‌గా హీరో వెంకటేశ్..
ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. అతడిలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడన్నాడు. ‘కోహ్లీ మంచి సింగర్, డాన్సర్, మిమిక్రీ చేయగల సమర్థుడు.. చాలా సరదాగా ఉంటాడు. మొత్తంగా కోహ్లీని మంచి ఎంటర్‌టైనర్‌గా చెబుతాను.’ అని ధోని అన్నాడు.