MS Dhoni Enjoying in Paris with his wife sakshi and daughter ziva
MS Dhoni Enjoying in Paris : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విహారయాత్రలో ఉన్నాడు. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఈఫిల్ టవర్ ముందు కూతురు, భార్యతో కలిసి ఫోటోలను ఫోజులు ఇచ్చాడు. అక్కడి వీధుల్లో తిరుగుతూ అభిమానులతో సెల్ఫీలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
David Warner : పుష్ప స్టైల్‌లో డేవిడ్ వార్నర్ హిందీ యాడ్.. అల్లు అర్జున్ రియాక్షన్ వైరల్
కాగా.. తన పర్యనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంది.
ఐపీఎల్ 2024లో అదరగొట్టిన ధోని..
ఈ సీజన్‌కు ముందు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 220.54 స్ట్రైక్‌రేటుతో 161 పరుగులు చేశాడు. అయితే.. ఇదే అతడికి ఆఖరి సీజన్ అని ప్రచారం జరిగింది. దీనిపై అతడు స్పందించలేదు. అతడు గాయంతో బాధపడుతున్నాడు. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. శస్త్ర చికిత్స అనంతరమే తన భవిష్యత్తు కార్యాచరణపై ధోని ఓ నిర్ణయానికి రానున్నట్లు సీఎస్‌కే వర్గాలు చెప్పినట్లు కథనాలు వచ్చాయి.
SA vs BAN : బంగ్లాదేశ్ కొంపముంచిన ఐసీసీ రూల్.. గెలిచే మ్యాచ్‌లో ఓటమి.. సౌతాఫ్రికా లక్కీ..
A fan with MS Dhoni at Paris. ?
– The favourite across the world, MS. pic.twitter.com/y5Hi5Skfwg
— Johns. (@CricCrazyJohns) June 7, 2024