IPL 2020 : ధోనికి బంగారు టోపి

Chennai Super Kings (CSK) : టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనికి ఫ్రాంచైజీ బంగారు టోపిని బహుకరించింది. ఫ్రాంచైజీ అంతర్గత అవార్డుల వేడుక అబుదాబిలో జరిగింది. మిస్టర్ కూల్ గా పిలవబడే..ధోని..చెన్నై సూపర్ కింగ్స్ కు పదేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించాడు.
ఈ పది సంవత్సరాల్లో మూడుసార్లు (2010, 2011, 2018) టైటిల్‌తో చెన్నైని ‘సూపర్ కింగ్స్’గా నిలిపాడు. ఈ మధ్యలో సీఎస్‌కేను రెండేళ్లు నిషేధించారు, విజయపథంలో నడిపించిన నాయకుడు ధోనికి ఫ్రాంచైజీ బంగారు టోపీతో పట్టం కట్టింది.
ఇదిలా ఉంటే..ఐపీఎల్ 2020 మ్యాచ్ లు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. Mumbai Indians, Chennai Super Kings మధ్య IPL 2020 తొలి మ్యాచ్ జరగనుంది. వ్యక్తిగత కారణాలతో రైనా, హర్బజన్ లు ఈ సీజన్ కు దూరం కావడం చెన్నై జట్టుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
https://10tv.in/ipl-2020-dhonis-chennai-super-kings-key-players-and-dream11-top-picks/
కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోని..జట్టుకు తగిన విజయాలు అందించాడు. 42.21 సగటుతో 170 ఇన్నింగ్స్ లో 4432 రన్లు సాధించాడు. ఇతని స్ట్రైక్ రేట్ 137.85గా ఉండడం విశేషం. గత ఏడాది ఐపీఎల్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో 83.20 యావరేజ్‌తో 416 పరుగులు చేసిన ధోనీ.. చెన్నై తరఫున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.