MS Dhoni : ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మిస్టర్ కూల్ ధోనీ పేరుతో భారీ రికార్డులు..

చెన్నై టీమ్ ధోనీ కెప్టెన్సీలో ఐదుసార్లు టైటిల్ సాధించింది. 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి CSK ఐదోసారి టైటిల్ గెలుచుకుంది.

MS Dhoni :  ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మిస్టర్ కూల్ ధోనీ పేరుతో భారీ రికార్డులు..

MS Dhoni

Updated On : March 22, 2024 / 8:12 AM IST

IPL CKS Captain : మిస్టర్ కూల్.. ది సెన్సేషనల్ బ్యాట్‌మెన్‌.. మహేందర్ సింగ్ ధోని కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఫ్యాన్స్‌ను నిరుత్సాహనికి గురి చేశాడు. ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2008లో చెన్నై జట్టు బాధ్యతలు తీసుకున్న ధోనీ ఇప్పటివరకు అదే ఫ్రాంచైజీ తరఫున ఆడారు. మధ్యలో రెండు సంవత్సరాలు చెన్నై జట్టును నిషేధించడంతో రైజింగ్ పుణే సూపర్ జాయింట్స్ తరపున ఆడాడు. 2022లో కూడా ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రవీంద్రజడేజా సీఎస్‌కేకు సారథ్యం వహించాడు. సీఎస్‌కేకు ఎన్నో విజయాలు అందించిన ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఓ వైపు టీమ్‌కు మరోవైపు సీఎస్‌కే ఫ్యాన్స్ కు లోటనే చెప్పొచ్చు.

Also Read : ధోనీ సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడంపై రోహిత్ శర్మ భావోద్వేగ పోస్ట్ వైరల్

చెన్నై టీమ్ ధోనీ కెప్టెన్సీలో ఐదుసార్లు టైటిల్ సాధించింది. 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి CSK ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో CSKను విజేతగా నిలిపారు మహేంద్ర సింగ్ ధోనీ. మిస్టర్ కూల్ ధోనీ పేరుతో ఐపీఎల్‌లో భారీ రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్ కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున 220 మ్యాచ్‌లు ఆడిన ధోని అత్యధికంగా 209 సిక్సర్లు కొట్టాడు. ఇందులో CSK కెప్టెన్‌గా ఉండి 218 సిక్సర్లు బాదిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. అతని పేరు మీద 4వేల 660 పరుగులు ఉన్నాయి. అంతేకాదు.. కెప్టెన్ గా 133 మ్యాచ్ లలో జట్టును విజేతగా నిలిపి.. కెప్టెన్ గా అత్యధిక ఐపీఎల్ విజయాలు సాధించిన రికార్డును కూడా ధోనీ సొంతం చేసుకున్నారు. సీఎస్ కే జట్టుకు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ 212 మ్యాచ్ లు ఆడాడు. అందులో 128 మ్యాచ్ లలో జట్టు విజయం సాధించింది. 82 సార్లు ఓటమి పాలైంది. రెండుసార్లు ఫలితం తేలలేదు.

Also Read : ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే సంచలనం.. ధోని ఆడతాడా, లేదా?

ధోనీ కెప్టెన్‌గా తప్పుకోవడంతో.. అతను ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించొచ్చని క్రికెట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఫామ్‌లో లేకపోవడం.. హెల్త్ సహకరించకపోవడంతో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకునే విషయాన్ని ధోని కొద్దిరోజుల ముందే పరోక్షంగా తెలిపాడు. 2024 సీజన్‌లో తనను కొత్త పాత్రలో చూడబోతున్నారంటూ లీకులు ఇచ్చాడు. ఫైనల్‌గా ధోని చెప్పిందే నిజమైంది. అతని స్థానంలో రుతురాజ్‌ సీఎస్‌కేను ముందుండి నడిపించనున్నాడు.

కెప్టెన్సీని స్వచ్ఛందంగా రుతురాజ్‌కు బదిలీ చేసిన ధోని.. ఈ సీజన్‌లో సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే.. తమ సొంత మైదానమైన చెపాక్‌లో ఆర్సీబీతో తలపడనుంది. తన ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలికేందుకు ఇదే సరైన సందర్భమని ధోని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సొంత మైదానం..ఛాలెంజింగ్‌ ప్రత్యర్ధిపై రేపటి మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగి తన క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముంది. రిటైరయ్యాక ధోని సీఎస్‌కే మెంటార్‌గా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని తప్పుకోవడంతో.. ఐపీఎల్‌లో గ్రేటెస్ట్‌ కెప్టెన్ల శకం ముగిసింది. ముంబైకి రోహిత్‌ శర్మ, సీఎస్‌కేకి ధోని ఐదేసి సార్లు ట్రోఫీలు అందించి రికార్డ్‌ను సెట్‌ చేసుకున్నారు.. ఇప్పుడీ ఇద్దరూ ఒకే సీజన్‌లో కెప్టెన్సీలకు గుడ్‌బై చెప్పడం ఫ్యాన్స్‌కు నిరాశను మిగిల్చింది.