ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే సంచలనం.. ధోని ఆడతాడా, లేదా?

గతేడాది టైటిల్ అందించిన ధోని ఈ సీజన్‌లోనూ కొనసాగుతాడని సీఎస్కే అభిమానులు భావించారు. ధోని కూడా అప్పుడప్నుడు మైదానంలో కనిపించడంతో అతడే కెప్టెన్‌గా ఉంటాడని అనుకున్నారు.

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే సంచలనం.. ధోని ఆడతాడా, లేదా?

why MS Dhoni steps down as CSK captain

MS Dhoni steps down as CSK captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభానికి ముందే సంచలనం నమోదైంది. డిపెండింగ్ చాంపియ‌న్‌ చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. మహేంద్ర సింగ్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించింది. గతేడాది టైటిల్ అందించిన ధోని ఈ సీజన్‌లోనూ కొనసాగుతాడని సీఎస్కే అభిమానులు భావించారు. అటు ధోని కూడా అప్పుడప్నుడు మైదానంలో కనిపించడంతో అతడే కెప్టెన్‌గా ఉంటాడని అనుకున్నారు. కానీ యంగ్ ప్లేయర్ రుతురాజ్‌కు కెప్టెన్ పగ్గాలు అప్పగిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్విటర్ లో అధికారిక ప్రకటన చేసింది.

ధోని ఆడతాడా, లేదా?
కెప్టెన్‌గా తప్పుకున్నా జట్టులో ఆటగాడిగా ఎంఎస్ ధోని కొనసాగుతాడని తెలుస్తోంది. అయితే దీనిపై సీఎస్కే నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మహి మైదానంలో దిగే వరకు వేచి చూడాల్సిందే. రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో ధోని ఆడతాడా, లేదా అనేది చూడాలి.

గత ఐపీఎల్‌లోనే మోకాలి నొప్పితో ధోని బాగా ఇబ్బంది ప‌డ్డాడు. వయసు మీద పడుతుండడంతో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవ‌డం అత‌డికి స‌వాల్‌గా మారింది. దీంతో అతడికి ప్రత్యామ్నాయంగా 2022లో ఆల్‌రౌండ‌ర్‌ రవీంద్ర జడేజాకు సీఎస్కే కెప్టెన్ పగ్గాలు అప్పగించింది. అయితే విఫలం అవడంతో టోర్ని మధ్యలోనే మరోసారి ధోని నాయకత్వ బాధ్యతలు భుజానికెత్తుకున్నాడు.

 

రుతురాజ్ రాణిస్తాడా?
కొత్త కెప్టెన్‌గా ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్ ముందున్న ప్రధాన సవాలు జట్టును విజయపథంలో నడిపించడం. 16 ఏళ్లు సీఎస్కే జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ధోని తన ముద్ర వేశాడు. దీంతో సీఎస్కే సారథ్య బాధ్యతలు నిర్వహించడం అంటే కొత్తవాళ్లకు సామాన్య విషయం కాదు. బ్యాటర్ గా ఇప్పటివరకు రుతురాజ్ తానేంటో నిరూపించుకున్నాడు. నాయకుడిగా జట్టును నడిపించడంలోనూ అతడు విజయవంతమైతే సీఎస్కే అభిమానులకు అంతకంటే కావాల్సి ఏం ఉంటుంది.

Also Read: ఐపీఎల్‌లో లక్కీ చాన్స్ కొట్టిన యంగ్ క్రికెటర్.. ఆ జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపిక