MS Dhoni shakes a leg on Gulabi Sharara song wins hearts on internet
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు (2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) అందించాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి నాలుగేళ్లు దాటినా కూడా అతడి ఫ్యాన్ పాలోయింగ్ తగ్గలేదు సరికదా మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు మహేంద్రుడు. తాజాగా తన భార్య సాక్షితో కలిసి ధోని డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2025 సీజన్‌కు చాలా సమయం ఉండడంతో ప్రస్తుతం ధోని తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో పర్యటిస్తున్నాడు.
ఈ క్రమంలో స్థానికులతో కలిసి ధోని, సాక్షిలు ప్రముఖ జానపద గీతం ‘గులాబి షరారా’కు ఆనందంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ధోని ఆడుతున్నాడు. అతడిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.4 కోట్లకు చెన్నై రిటైన్ చేసుకుంది. దీంతో ధోనిని ఐపీఎల్ 2025లో చూడొచ్చు అని అభిమానులు ఆరాట పడుతున్నాడు.
ఐపీఎల్ 2024లో ధోని మోకాలి గాయంతో బాధపడుతూనే ఆడాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్ కు దిగి పాత ధోనిని గుర్తు చేస్తూ బౌండరీలతో ఫ్యాన్స్‌ను అలరించాడు.
MS Dhoni and Sakshi dancing on Garhwali song in Rishikesh. ❤️ pic.twitter.com/TNjrhSeV5V
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2024