IPL 2021 MI Vs SRH : హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి

ఐపీఎల్ 2021 సీజన్ 14లో హైదరాబాద్ తీరు మారలేదు. మరోసారి ఓడింది. హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. డేవిడ్ వార్నర్(23), జానీ బెయిర్ స్టో(43), విజయ్ శంకర్(28) మినహా అంతా విఫలం అయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చహర్ చెరో మూడు వికెట్లు తీశారు.

Mumbai Indians Beat Sunrisers Hyderabad By 13 Runs

IPL 2021 MI Vs SRH : ఐపీఎల్ 2021 సీజన్ 14లో హైదరాబాద్ తీరు మారలేదు. మరోసారి ఓడింది. హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. డేవిడ్ వార్నర్(23), జానీ బెయిర్ స్టో(43), విజయ్ శంకర్(28) మినహా అంతా విఫలం అయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చహర్ చెరో మూడు వికెట్లు తీశారు.

ముంబై నిర్దేశించిన 151 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని కూడా వార్నర్ సేన ఛేదించలేకపోయింది. చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయి చేజేతులా మ్యాచ్‌ను అప్పగించింది. దీంతో ఈ సీజన్‌లో హైదరాబాద్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ముంబైకిది రెండో విజయం. చివరి ఓవర్‌లో బౌల్ట్‌… భువనేశ్వర్‌, ఖలీల్‌ను బౌల్డ్‌ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(43), డేవిడ్‌ వార్నర్‌(36) శుభారంభం చేసినా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. అంతకుముందు ముంబై ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(40; 39 బంతుల్లో 5×4), రోహిత్‌ శర్మ(32; 25 బంతుల్లో 2×2, 2×6) రాణించారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. సూర్యకుమార్‌(10), ఇషాన్‌ కిషన్‌(12), హార్దిక్‌ పాండ్య(7) ధాటిగా ఆడే క్రమంలో స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. అయితే, చివర్లో పొలార్డ్‌(35*; 22 బంతుల్లో 1×4, 3×6) సిక్సులతో చెలరేగడంతో ముంబై 150 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, విజయ్‌ శంకర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్ పడగొట్టాడు. పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో ముంబై టాప్ లో ఉండగా, హ్యాట్రిక్ ఓటములతో హైదరాబాద్ అట్టడగున ఉంది.