మాకు తెలుసులే: యువీ నా భర్త చొక్కా తొడుక్కున్నాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంటే విపరీతమైన క్రేజ్. భారీ అంచనాలతో అత్యంత రిచ్‌గా జరిగే ఐపీఎల్ అంటే కొద్ది వారాల ముందే హడావుడి మొదలైపోతుంది. మార్చి 23 నుంచి జరగనున్న ఐపీఎల్ 12వ సీజన్‌కు పబ్లిసిటీ మొదలుపెట్టేశాయి ఫ్రాంచైజీలు. ప్రచారంలోనూ కొత్తదనాన్ని చూపించే ముంబై ఇండియన్స్ రోహిత్ జెర్సీ వేసుకున్న యువరాజ్ సింగ్ ఫొటోను పోస్టు చేసి ఎవరో కనుక్కోమని ట్వీట్ చేసింది.
ఆ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తులో స్పందన వచ్చింది. వాటన్నిటికీ కంటే భిన్నంగా రోహిత్ శర్మ భార్య రితికా మా అన్యయ్య నా భర్త జెర్సీ వేసుకున్నాడంటూ ట్వీట్ చేసింది. దీనిపై రితికాపై మిశ్రమ స్పందన వస్తుంది. అంతకుముందు ఒకసారి రోహిత్‌ను కెప్టెన్ కూల్ అని అభివర్ణిస్తూ చేసిన ట్వీట్‌కు రితికాను తిట్టిపోశారు నెటిజన్లు.
ఎవరెలాపోతే మాకేం. చక్కగా పబ్లిసిటీ వచ్చి పడుతుంది కదా అని ముంబై ఇండియన్స్ సైలెంట్‌గా కూర్చొంది.