Young Player: 72 గంటలకు పైగా క్రీజులో.. చరిత్ర సృష్టించిన యువ క్రికెటర్!

సుదీర్ఘ బ్యాటింగ్ రికార్డును నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా ముంబై టీనేజర్ సిద్ధార్థ్ మోహితే నెట్ సెషన్‌లో 72 గంటల ఐదు నిమిషాలు క్రీజులో గడిపాడు.

Young Player: 72 గంటలకు పైగా క్రీజులో.. చరిత్ర సృష్టించిన యువ క్రికెటర్!

Cricket

Updated On : March 1, 2022 / 7:26 PM IST

Young Player: సుదీర్ఘ బ్యాటింగ్ రికార్డును నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా ముంబై టీనేజర్ సిద్ధార్థ్ మోహితే నెట్ సెషన్‌లో 72 గంటల ఐదు నిమిషాలు క్రీజులో గడిపాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా తన అచీవ్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 19 ఏళ్ల సిద్ధార్థ్ మోహితే గత వారం 72 గంటల ఐదు నిమిషాలు బ్యాటింగ్ చేసి 2015 నాటి విరాగ్ మానే 50 గంటల బ్యాటింగ్ రికార్డును అధిగమించాడు.

కోచ్ జ్వాలా సింగ్ సహకారంతో..
సిద్ధార్థ్ మోహితే ముంబైలో విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ప్రకారం.. “నేను చేసిన ప్రయత్నం విజయవంతం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను భిన్నంగా ఉండేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తాను.. ఆ ప్రయత్నింలోనే ఈ రికార్డు కోసం కృషి చేశాను..

కోచ్ జ్వాలా సింగ్ కూడా మోహితేకి అతని ప్రయత్నంలో సహాయం చేశారు. తనకు ఈ విషయంలో ఎవ్వరూ సహాయం చెయ్యలేకపోయారని, జ్వాలా సర్‌ మాత్రమే ఎందుకు కుదరదు అని సహాయం చేశారు.” అని చెప్పారు.

బౌలర్ల గ్రూప్ కూడా మోహితేకి మద్దతుగా సీజన్ అంతా అతని పక్షాన నిలిచింది. నిబంధనల ప్రకారం, ఒక బ్యాట్స్‌మెన్ గంటలో ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవచ్చు. మోహిత రికార్డింగ్ మరియు సంబంధిత పత్రాలు ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపబడ్డాయి.