Musheer Khan : రోడ్డు ప్ర‌మాదానికి గురైన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడు ముషీర్ ఖాన్‌.. 3 నెల‌లు ఆట‌కు దూరం!

టీమ్ఇండియా ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్ర‌మాదానికి గురి అయ్యాడు.

Musheer Khan

Musheer Khan : టీమ్ఇండియా ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్ర‌మాదానికి గురి అయ్యాడు. దీంతో అత‌డు ఇరానీ ట్రోఫీకి దూరం అయిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 19 ఏళ్ల ముషీర్ ఆఖాన్ త‌న తండ్రి నౌష‌ద్ ఖాన్‌తో క‌లిసి ల‌క్నోకు వెలుతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. అత‌డికి గాయాలు అయ్యాయ‌ని, దీంతో మూడు నెల‌ల పాటు ఆట‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంద‌ని స‌ద‌రు వార్త‌ల సారాంశం.

ముంబై జ‌ట్టుకు ముషీర్ ఖాన్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అక్టోబ‌ర్ 1 నుంచి ఇరానీ ట్రోఫీ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచులు ఆడేందుకు ముంబై జ‌ట్టు ఇప్ప‌టికే ల‌క్నోకు చేరుకోగా.. జ‌ట్టుతో పాటు అత‌డు వెళ్ల‌లేదు. వ్య‌క్తిగ‌త ప‌నులను పూర్తి చేసుకున్న త‌రువాత అత‌డు తన తండ్రితో క‌లిసి అజంగఢ్ నుండి లక్నోకు వెలుతుండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో ముషీర్ మెడ‌కు స్వ‌ల్పంగా గాయాలు అయ్యాయి. మూడు నెల‌ల పాటు అత‌డు ఆట‌కు దూరం కానున్నాడు. అని క్రికెట్ వ‌ర్గాలు తెలిపాయి.

IND vs BAN : భార‌త అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. మైదానం నుంచి హోట‌ల్‌కు వెళ్లిపోయిన టీమ్ఇండియా..

రెండేళ్ల క్రితం టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ముషీర్ ఖాన్ కూడా రోడ్డు ప్ర‌మాదానికి గురి అయ్యాడ‌ని తెలిసి ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు గురి అయ్యారు. అయితే.. పెద్ద‌గా గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇటీవ‌ల దులీప్ ట్రోఫీలో ఇండియా సి త‌ర‌పున ఆడి ముషీర్ 181 ప‌రుగులు సాధించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను 9 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. భార‌త జ‌ట్టు న‌వంబ‌ర్ రెండో వారంలో ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌నుంది. అంత‌కంటే ముందే భార‌త ఏ జ‌ట్టు కూడా ఆస్ట్రేలియా వెళ్ల‌నుంది. అక్క‌డ రెండు మ్యాచులు ఆడ‌నుంది. దులీప్ ట్రోఫీలో ముషీర్ అద‌ర‌గొట్ట‌డంతో ఇండియా ఏ జ‌ట్టులో చోటు ద‌క్క‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు అత‌డు రోడ్డు ప్ర‌మాదానికి గురి కావ‌డంతో ఈ మ్యాచ్‌ల‌కు దూరం అయ్యే అవ‌కాశం ఉంది.

IND vs BAN : బంగ్లాదేశ్ కెప్టెన్ న‌జ్ముల్ వికెట్ కోసం అశ్విన్ సూప‌ర్ ప్లాన్ : దినేశ్ కార్తిక్‌