Ambati Rayudu : సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూడాల‌నేది నా క‌ల‌.. ఇంకో అడుగు దూర‌మే : అంబ‌టి రాయుడు

జ‌న‌సేన అధినేత అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Ambati Rayudu – Pawan Kalyan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు నాలుగో సారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ త‌రువాత జ‌న‌సేన అధినేత అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న‌ప్పుడు స‌భా ప్రాంగ‌ణం అంతా హోరెత్తింది.

ఇక మంత్రిగా ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో ప‌లువురు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు జ‌న‌సేనానికి సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Pakistan : భార‌త్ వ‌ర్సెస్‌ పాక్ మ్యాచ్ పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌.. యూట్యూబ‌ర్‌ను కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు

ఈ క్ర‌మంలో టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు సైతం ప‌వ‌న్ కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. సీఎంగా ప‌వ‌న్‌ను చూడాల‌నే త‌న క‌ల‌కు అడుగు దూరంలో ప‌వ‌న్ నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.

‘డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అభినంద‌న‌లు. భ‌విష్య‌త్తులో ఆయ‌న్ను సీఎంగా చూడాల‌నే నా క‌ల‌కు కేవ‌లం అడుగు దూరంలో ఉన్నారు. నిజంగా ఈ రోజు జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు నిజంగా పండ‌గ రోజు.’ అని రాయుడు ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Danni Wyatt : ప్రేయ‌సిని పెళ్లాడిన ఇంగ్లాండ్ మ‌హిళా స్టార్ క్రికెట‌ర్‌.. ఫోటోలు వైర‌ల్‌

 

ట్రెండింగ్ వార్తలు