Najmul Hossain Shanto : అరుదైన జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్‌.. విరాట్‌ కోహ్లి, స్మిత్‌ సరసన

Najmul Hossain Shanto joins elite list : బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Najmul Hossain Shanto : అరుదైన జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్‌.. విరాట్‌ కోహ్లి, స్మిత్‌ సరసన

Najmul Hossain Shanto

Updated On : November 30, 2023 / 9:35 PM IST

బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో అరుదైన ఘ‌న‌త సాధించాడు. కెప్టెన్‌గా త‌న మొద‌టి టెస్టులోనే సెంచ‌రీ చేశాడు. సిల్హెట్‌ వేదికగా న్యూజిలాండ్ జ‌ట్టుతో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచులో అత‌డు ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో శాంటో సెంచ‌రీతో చెల‌రేగాడు.

ఈ క్ర‌మంలో టెస్టు కెప్టెన్సీ అరంగ్రేటంలోనే సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ, జో రూట్‌, స్టీవ్ స్మిత్, శివ‌న‌రైన్ చంద్ర‌పాట్ వంటి దిగ్గ‌జాలు ఉన్న ఈ జాబితాలో 32వ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Rahul Dravid : నేనింకా సంత‌కం చేయ‌లేదు.. కాంట్రాక్ట్ పొడిగింపు పై రాహుల్ ద్ర‌విడ్‌

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బంగ్లాదేశ్ త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 310 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మహ్మదుల్ హసన్ జాయ్ (86) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. అనంత‌రం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 ప‌రుగులు చేసింది. కేన్ విలిమ‌య్స‌న్ స‌న్ (104) సెంచ‌రీ చేశాడు. దీంతో కివీస్‌కు ఏడు ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది.

ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్లు న‌ష్టాపోయి 212 ప‌రుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (104) శ‌త‌కం చేయ‌గా, ముష్ఫికర్ రహీమ్ 43 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ 205 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

Team India : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు భార‌త టీ20, టెస్టు, వ‌న్డే జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌ .. టెస్టుల‌కే ప‌రిమిత‌మైన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ