Neeraj Chopra Marriage: పెళ్లి చేసుకున్న స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. వధువు ఎవరో తెలుసా?
నీరజ్ చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫొటోలను షేర్ చేసి ఇలా రాశాడు.. ‘‘ నేను నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని నా కుటుంబంతో ప్రారంభించాను. మమ్మల్ని ఈ క్షణం వరకు నడిపించేందుకు ..

Neeraj Chopra Marriage
Neeraj Chopra Marriage: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. ఎలాంటి హడావుడి లేకుండా తనకు అత్యంత సన్నిహితుల సమక్షంలో హిమానీతో నీరజ్ చోప్రా వివాహం జరిగింది. పెళ్లి ఫొటోలను నీరజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. రెండు రోజుల క్రితమే వీరి వివాహం జరిగింది. అయితే, గతంలో ఎప్పుడూ నీరజ్ తన పెళ్లి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. అయితే, ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లిచేసుకొని సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేయడం నెటిజన్లను, ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
నీరజ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫొటోలను షేర్ చేసి ఇలా రాశాడు.. ‘‘ నేను నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని నా కుటుంబంతో ప్రారంభించాను. మమ్మల్ని ఈ క్షణం వరకు నడిపించేందుకు ఆశీర్వదించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. ప్రేమతో బంధించబడి.. సంతోషంగా ఎప్పటికీ.’’ అంటూ చోప్రా పేర్కొన్నాడు. నీరజ్ పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో రజత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. తన అద్భుత ప్రతిభతో ఎన్నో అవార్డులను చోప్రా అందుకున్నాడు.
నీరజ్ చోప్రా ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లిచేసుకొని అందర్ని ఆశ్చర్యపర్చాడు. దీంతో ఇంతకీ నీరజ్ చేసుకున్న అమ్మాయి ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటనే చర్చ జరుగుతుంది. నీరజ్ భార్య పేరు హిమానీ. ఆమె ప్రస్తుత్ అమెరికాలో చదువుతుంది. న్యూ హాంప్‌షైర్‌లోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో ‘స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్’, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో డ్యూయల్ ఎంబీఏ డిగ్రీలు పొందారు. ప్రస్తుతం ఆమె మసాచుసెట్స్ లోని అమ్హెర్స్ట్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. మెక్‌కార్మాక్ ఇసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతోంది. హిమానీ హర్యానాలోని లార్సౌలీ ప్రాంతానికి చెందిన యువతి. పానిపట్ లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ లో పాఠశాల విద్య పూర్తి చేసింది. ఆమె ఢిల్లీ యూనివర్శిటీలోని మిరాండా హౌస్ నుంచి పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
View this post on Instagram
హిమానీ టెన్నిస్ క్రీడాకారిణి కూడా. ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ (ఏఐటీఏ) వెబ్ సైట్ ప్రకారం.. 2018 నుంచి 2021 వరకు టెన్నిస్ క్రీడలో కొనసాగింది. 2018లో జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా సింగిల్స్ లో 42వ, డబుల్స్ లో 27వ ర్యాంకును అందుకుంది. నీరజ్ చోప్రా – హిమానీ వివాహం గురించి నీరజ్ మేనమామ మాట్లాడుతూ.. నీరజ్ – హిమానీ వివాహం మనదేశంలోనే జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వారు హనీమూన్ కు వెళ్లారని చెప్పాడు.