Trent Boult: న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మరో ఘనత

కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సత్తా చాటాడు. వన్డే ప్రపంచకప్ లో 50 వికెట్లు పడగొట్టిన తొలి న్యూజిలాండ్ బౌలర్ గా రికార్డుకెక్కాడు.

Trent Boult: న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మరో ఘనత

New Zealand bowler Trent Boult completes 50 ODI World Cup wickets

Updated On : November 9, 2023 / 4:07 PM IST

Trent Boult 50 ODI World Cup wickets: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మరో ఘనత సాధించాడు. వన్డే ప్రపంచప్ లో 50 వికెట్లు పడొగొట్టిన కివీస్ ఫస్ట్ బౌలర్ గా రికార్డుకెక్కాడు. బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో గురువారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కుశాల్ మెండిస్ వికెట్ పడగొట్టి 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన మూడో న్యూజిలాండ్ బౌలర్ గా నిలిచాడు. టిమ్ సౌతీ(732), డానియల్ వెటోరి(705) అతడి కంటే ముందున్నారు.

వరల్డ్ కప్ లో వేగంగా 50 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా గుర్తింపు పొందాడు. 28 ఇన్నింగ్స్ లో అతడీ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ 19, శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ 25 ఇన్నింగ్స్ లోనే ప్రపంచకప్ లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. గ్లెన్ మెక్‌గ్రాత్(30), మురళీధరన్(30), వసీం అక్రం(33) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వన్డే ప్రపంచకప్ లో 50 ప్లస్ వికెట్లు పడగొట్టిన వారిలో గ్లెన్ మెక్‌గ్రాత్ అందరికంటే ముందున్నాడు. అతడు ఓవరాల్ గా 71 వికెట్లు తీశాడు. మురళీధరన్(68), మిచెల్ స్టార్క్(59), లసిత్ మలింగ(56), వసీం అక్రం(55), ట్రెంట్ బౌల్ట్ (51) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తక్కువ బంతుల్లో 50 ప్రపంచకప్ వికెట్లు తీసిన బౌలర్లు
941 – మిచెల్ స్టార్క్
1187 – లసిత్ మలింగ
1540 – గ్లెన్ మెక్‌గ్రాత్
1543 – ట్రెంట్ బౌల్ట్
1562 – ఎం మురళీధరన్
1748 – వసీం అక్రమ్

Also Read: టీమిండియాను ఓడించగలరా? ఇంగ్లండ్ పై ఓటమి తరువాత నెదర్లాండ్స్ బ్యాటర్ ఆసక్తికర వ్యాఖ్యలు