New Zealand Team
IND vs NZ 1st Test: బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించింది. టెస్టు మ్యాచ్ లో భాగంగా ఐదోరోజు 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టులో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోర్ బోర్డు తెరవకుండానే ఓపెనర్ టామ్ లేథమ్ ను భారత్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. కొద్దిసేపటి తరువాత డేవన్ కాన్వే(17)ను కూడా బుమ్రా ఔట్ చేశాడు. దీంతో కివీస్ జట్టుపై భారత్ పట్టుబిగిస్తున్నట్లు కనిపించింది. కానీ, ఆ తరువాత వికెట్ కోల్పోకుండా విల్ యంగ్ (48), రచిన్ రవీంద్ర (39) పరుగులతో న్యూజిలాండ్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత్ జట్టుపై విజయంతో 36ఏళ్ల నిరీక్షణకు న్యూజిలాండ్ తెరదించింది. భారత్ లో చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ విజయం సాధించింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్ లోనూ భారత్ పై కివీస్ జట్టు విజయం సాధించలేదు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారతదేశంలో భారత్ జట్టును మూడు సార్లు ఓడించింది. 1969లో 167 పరుగుల తేడాతో కివీస్ తొలిసారి విజయం సాధించింది. 1988లో 136 పరుగుల తేడాతో రెండోసారి విజయం సాధించింది. 2024లో ఎనిమిది వికెట్ల తేడాతో మూడోసారి న్యూజిలాండ్ జట్టు టీమిండియాపై విజయం సాధించింది.
మరోవైపు ఈ ఏడాది ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ ను టీమిండియా స్వదేశంలో ఓడిపోయింది. ఆ తరువాత మరో భారత్ జట్టుకు మరో ఓటమి ఎదురైంది.
🚨 HISTORY AT CHINNASWAMY 🚨
NEW ZEALAND DEFEATED INDIA IN INDIA IN A TEST AFTER 36 YEARS. pic.twitter.com/NgMY7KT1YX
— Johns. (@CricCrazyJohns) October 20, 2024
FIRST TEST WIN FOR NEW ZEALAND IN INDIA IN THIS CENTURY 🙇 pic.twitter.com/abhE9a1KqF
— Johns. (@CricCrazyJohns) October 20, 2024