WTC 2025: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓడిపోతే.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు టీమిండియా చేరుకుంటుందా.. ఎలా?
తొలి టెస్టు లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు చేరేందుకు టీమిండియాకు కాస్త కష్టమవుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా (74.24శాతంతో) అగ్ర స్థానంలో ఉంది.

Team india
IND vs NZ 1st Test: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో చివరి రోజు ఆట ఇవాళ జరగనుంది. న్యూజిలాండ్ జట్టు విజయం సాధించాలంటే 107 పరుగులు చేయాల్సి ఉంటుంది. రోజంతా సమయం ఉండటంతోపాటు, న్యూజిలాండ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడంతో ఆ జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, చివరి రోజు మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తొలిరోజు మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నాల్గో రోజు (శనివారం) వర్షం కారణంగా పలుసార్లు మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం (ఐదోరోజు) వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం కారణంగా రద్దయితే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అద్బుతం జరిగితే మినహా ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతే.. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరే అవకాశాలను కోల్పోతుందా.. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో ఓడినా టీమిండియా ఫైనల్ కు చేరాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
Also Read: 462 పరుగులకు టీమిండియా ఆలౌట్.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం
తొలి టెస్టు లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు చేరేందుకు టీమిండియాకు కాస్త కష్టమవుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా (74.24శాతంతో) అగ్ర స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (62.50 శాతం) రెండో స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో శ్రీలంక (55.66శాతం), ఇంగ్లాండ్ (43.06శాతం), సౌతాఫ్రికా (38.89శాతం), న్యూజిలాండ్ (37.50శాతం) జట్లు ఉన్నాయి.
టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో మరో రెండు టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ తరువాత ఆస్ట్రేలియా జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కూడా భారత్ లోనే జరగనుంది.
బెంగళూరు టెస్ట్ తరువాత డబ్ల్యూటీసీ సీజన్ 2023-2025లో భారత్ జట్టు మరో ఏడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. కివీస్ తో తొలి టెస్టు డ్రా అయినా, ఓడిపోయానా.. టీమిండియా మిగిలిన ఏడు మ్యాచ్ లలో కనీసం మూడు మ్యాచ్ లలో గెలవాల్సి ఉంటుంది. నాలుగు మ్యాచ్ లు గెలిస్తే ఫైనల్స్ బెర్త్ దాదాపు ఖాయం అవుతుంది. మూడు టెస్టుల్లో గెలిచిన పక్షంలో.. భారత్ ఫైనల్స్ కు చేరాలంటే వేరే జట్టు గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది.