NZ vs SA : విజృంభించిన బౌల‌ర్లు.. ద‌క్షిణాఫ్రికా పై న్యూజిలాండ్ రికార్డు విజ‌యం..

రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది.

NZ vs SA : విజృంభించిన బౌల‌ర్లు.. ద‌క్షిణాఫ్రికా పై న్యూజిలాండ్ రికార్డు విజ‌యం..

NZ vs RSA 1st Test

NZ vs SA 1st Test : రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. మౌంట్ మౌంగనుయి వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచులో ద‌క్షిణాఫ్రికా పై 281 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు పై టెస్టుల్లో కివీస్ ఇదే అతి పెద్ద గెలుపు కావ‌డం గ‌మ‌నార్హం. 1994లో జోహెన్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా జ‌రిగిన టెస్టు మ్యాచులో న్యూజిలాండ్ 137 ప‌రుగుల తేడాతో స‌ఫారీల‌ను ఓడించింది.

528 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా 247 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. స‌పారీ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ బెడింగ్‌హామ్ (87; 96 బంతుల్లో 13 ఫోర్లు, 3సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. జుబేర్ హంజా (36), రువాన్ డి స్వర్డ్ (34 నాటౌట్‌) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ద‌క్షిణాఫ్రికాకు ఘోర ఓట‌మి త‌ప్ప‌లేదు. కివీస్ బౌల‌ర్ల‌లో కైలీ జేమీస‌న్ నాలుగు వికెట్ల‌తో ద‌క్షిణాఫ్రికా వెన్ను విరిచాడు. మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. టిమ్ సౌతీ, మాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Hanuma Vihari : రీ ఎంట్రీ పై తెలుగు కుర్రాడు హ‌నుమ విహారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఎవ‌రూ ట‌చ్‌లో లేరు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ద‌క్షిణాప్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. యువ ఆట‌గాడు ర‌చిన్ ర‌వీంద్ర (240; 366 బంతుల్లో 26 ఫోర్లు, 3సిక్స‌ర్లు) డ‌బుల్ సెంచ‌రీ చేయ‌గా కేన్ విలియ‌మ్ స‌న్ (118; 289 బంతుల్లో 16 ఫోర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో కివీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 511 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో నీల్ బ్రాండ్ ఆరు వికెట్ల‌తో రాణించాడు.

అనంత‌రం న్యూజిలాండ్ బౌల‌ర్లు విజృంభించ‌డంతో ద‌క్షిణాఫ్రికా మొద‌టి ఇన్నింగ్స్‌లో 162 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో న్యూజిలాండ్ కు 349 ప‌రుగుల‌కు కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది. విలియ‌మ్ స‌న్ (109; 132 బంతుల్లో 12 ఫోర్లు, 1సిక్స్‌) శ‌త‌కంతో చెల‌రేగాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా ముందు 528 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

Viral Video : నీటి ప్ర‌వాహ‌మే పిచ్‌.. కాలువ‌కు అటువైపు బ్యాట‌ర్‌.. ఇటు వైపు బౌల‌ర్‌.. ఇది నెక్ట్స్ లెవెల్ క్రికెట్‌