Kane Williamson : టీ20 లీగుల మోజులో కివీస్ క్రికెట‌ర్లు.. కేన్ మామ నువ్వు కూడానా.. జింబాబ్వేతో సిరీస్‌కు న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే..

జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన న్యూజిలాండ్ జ‌ట్టును ప్ర‌క‌టించారు

Kane Williamson : టీ20 లీగుల మోజులో కివీస్ క్రికెట‌ర్లు.. కేన్ మామ నువ్వు కూడానా.. జింబాబ్వేతో సిరీస్‌కు న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే..

New Zealand pick squad for Test series against Zimbabwe No Kane Williamson

Updated On : July 8, 2025 / 4:34 PM IST

జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన న్యూజిలాండ్ జ‌ట్టును ప్ర‌క‌టించారు. టామ్ లేథ‌మ్ సార‌థ్యంలోనే కివీస్ బ‌రిలోకి దిగ‌నుంది. అయితే.. స్టార్ ఆట‌గాడు, మాజీ కెప్టెన్ విలియ‌మ్స‌న్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్, కైల్‌ జేమీసన్‌ లు ఈ సిరీస్‌కు అందుబాటులో లేన‌ట్లు సెల‌క్ట‌ర్లు తెలిపారు.

కేన్ మామ ప్ర‌స్తుతం విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీలో మిడిల్ సెక్స్‌కు ఆడుతుండడంతో జింబాబ్వేతో టెస్టు సిరీస్ నుంచి స్వ‌చ్ఛంగా త‌ప్పుకున్నాడు. మ‌రో ఆట‌గాడు మైఖేల్ బ్రేస్ వెల్ ఫ్రాంచైజీ కమిట్‌మెంట్స్‌ కారణంగా జింబాబ్వేతో సిరీస్‌లో ఆడ‌డం లేదు. జింబాబ్వేతో సిరీస్ జ‌రిగే స‌మ‌యంలో అత‌డు హండ్రెడ్‌ లీగ్‌లో ఆడ‌నున్నాడు. కైల్ జేమీస‌న్ భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండ‌డంతో జేమీస‌న్ సైతం ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

ENG vs IND : భార‌త్‌తో మూడో టెస్టు.. కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌కు పెద్ద స‌వాలే..

ఈ ఏడాది ఆరంభంలో కివీస్ బోర్డు ఇచ్చే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కేన్ మామ తిర‌స్క‌రించాడు. తాను జాతీయ జ‌ట్టుకు అందుబాటులోనే ఉంటాన‌ని, అదే స‌మ‌యంలో ప్రైవేటు లీగ్‌లు ఆడ‌తాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నాడు.

జింబాబ్వేతో సిరీస్ కోసం యువ ఆట‌గాడు మ్యాట్ ఫిష‌ర్‌కు తొలి సారి జాతీయ జ‌ట్టులో స్థానం ల‌భించింది. ఈ పేస‌ర్ 14 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 24.11 స‌గ‌టుతో 51 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

న్యూజిలాండ్‌, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య జూలై 30 నుంచి తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, రెండో ఆగ‌స్టు 7న ప్రారంభం కానుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా బులవాయో వేదికగా జరుగుతాయి.

Team India : వామ్మో.. మీరేం ఆల్‌రౌండ‌ర్లురా బాబు.. ఒక‌రిని మించి మ‌రొకరు.. టీమ్ఇండియాకు కొత్త త‌ల‌నొప్పి..

జింబాబ్వేతో సిరీస్ కోసం న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే..
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లుండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్ , విల్ ఓ’రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , నాథన్ స్మిత్, విల్ యంగ్.